సీఎం కావాలని కోరుకోకూడదు.. అది జరిగిపోవాలి!
on Apr 4, 2021
ముఖ్యమంత్రి కావాలని మనం కోరుకోకూడదనీ, అది దానంతట అది జరిగిపోవాలనీ జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ఏ పదవి కోసం వెంపర్లాడనని అన్నారు. ఆదివారం రాత్రి జరిగిన 'వకీల్ సాబ్' ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు అభిమానులు "సీఎం.. సీఎం" అంటూ పెద్దపెట్టున కేకలు వేశారు. దీనికి పవర్‌స్టార్ స్పందించారు.
"సీఎం అనేది మనం కోరుకోకూడదు. అది జరిగిపోవాలి. మీ హృదయంలో స్థానం దొరుకుందని అనుకోలేదు. కానీ ఇంత ప్రేమ ఇచ్చారు. సమాజం కోసం దేశం కోసం పనిచేస్తూ వెళ్తుంటాం. ఆ క్రమంలో ఉన్నత స్థానం దొరికిందా సంతోషం, మీ గుండెల్లో స్థానం కంటే ఉన్నత స్థానం మరేది ఉంటుంది! అంతకుమించింది ఏదీ లేదు." అని ఆయన అన్నారు.
తాను సమాజం కోసం పనిచేసే వ్యక్తినని పీకే చెప్పారు. "నేను ఏ పదవి కోసం వెంపర్లాడను. బాధ్యతలు ఉంటే ఆధ్యాత్మిక భావాలు రావు అని చిరంజీవి గారు చెప్పిన మాటలే నన్ను నటుడిని చేశాయి. ఆ మాటలే ఇవాళ రాజకీయాల్లోకి తీసుకెళ్లాయి. ముక్కు మూసుకుని ధ్యానం చేసేకంటే, మన సెల్ఫ్ రియలైజేషన్ కంటే కూడా, కష్టాలు నష్టాలు అనుభవిస్తూ, తిట్లు తింటూ కర్మ యోగం చేయడం కష్టం. నేను ఇవాళ కర్మ యోగం చేస్తున్నాను. ఆ ఆశీస్సులు భగవంతుడు నాకు ఇచ్చాడు." అని ఆయన అన్నారు.
Also Read