ENGLISH | TELUGU  

నేను సినిమాలకోసం ఎవర్నీ యాచించలేను: ప‌వ‌న్ క‌ల్యాణ్

on Apr 4, 2021

 

"నేను సినిమాలకోసం ఎవర్నీ ఏదీ అడగలేను, యాచించలేను. అది నా తత్వం." అన్నారు ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌. మూడేళ్ల త‌ర్వాత ఆయ‌న న‌టించిన 'వ‌కీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. "మా నాన్న కానిస్టేబుల్. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నా దృష్టిలో ఏ వృత్తీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను నమ్ముతాను." అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. 'వకీల్ సాబ్' లోని "జనగణ మన" పాట లేజర్ షో తో కార్యక్రమం ప్రారంభమైంది. సంగీత దర్శకుడు థమన్ ఆధ్వర్యంలోని మ్యూజికల్ షో అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు, దర్శకులు జాగర్లమూడి క్రిష్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, సాగర్ చంద్ర, నిర్మాత‌లు ఏఎం రత్నం, రవి శంకర్, బండ్ల గణేష్, రామ్ తాళ్లూరి, సూర్య‌దేవ‌ర‌ నాగవంశీ, నాయికలు అంజలి, అనన్య నాగళ్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులను సత్కరించారు. వుమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, విద్యావేత్త పద్మావతి, తూప్రాన్ రైల్వే గేట్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను కాపాడిన సాహస బాలిక రుచిత సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

డీఐజీ సుమతి మాట్లాడుతూ.....ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ గా మీ ముందు ఉండటం, వకీల్ సాబ్ లాంటి సినిమా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఒక స్త్రీని అమ్మగా ఊహించుకున్నప్పుడు ఏ రకమైన ఇజాన్ని ఆపాదించం, ఒక చెల్లిగానో, అక్కగానో చూసినప్పుడు కూడా తప్పుగా అనుకోం, అలాగే వివిధ రంగాల్లో ఉన్న యువతులను, వాళ్లు ఏదో సాధించారు అనే అభిప్రాయంతో గొప్పగా చూస్తారు. కానీ ఏమీ లేకుండా ఒక మహిళను మహిళలా చూడాలి. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఈ దేశంలో క్రియేట్ చేయబడిన చట్టాలన్నీ మేల్ తో తయారు చేశారు మేల్ కోసం. మహిళ, పురుషులు ఎవరికైనా మూస ప్రవర్తన ఉండకూడదు. మీరు వర్జినా అని అడుగుతారా, మేల్ ను అడిగినప్పుడు అంతా అబ్జక్షన్ చెబుతారు. అదీ మేల్ కున్న అడ్వాంటేజ్. వకీల్ సాబ్ లాంటి మూవీ తప్పకుండా మార్పు తీసుకొస్తుంది. అలాంటి మార్పు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నన్ను ఇక్కడికి పిలిచి సత్కరించిన వాళ్లకు థాంక్స్. తెలుగు ప్రేక్షకురాలిగా నేనూ వకీల్ సాబ్ విజయాన్ని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... "ఫ్యాన్స్ నందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయా అంటారు. లంచ్ టైమ్ లో షూటింగ్ జరుగుతుంది. ట్విట్టర్ ఓపెన్ చేశాను ఏం న్యూస్ వచ్చిందని, అందులో ఒక మెసేజ్ అభిమాని పంపింది ఉంది. అందులో ఎండ బాగుంది, మా హీరోను బాగా చూసుకోండి అని పంపారు. మనకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ గారి ఫిలిం ఫెస్టివల్ మొదలవబోతోంది. అందులో వకీల్ సాబ్ శుభారంభం చేయబోతోంది. ఇలాంటి గొప్ప ఇతివృత్తమున్న చిత్రాన్ని పవన్ గారి దగ్గరకు తీసుకెళ్లిన నిర్మాత దిల్ రాజు గారికి శతకోటి వందనాలు. ఇది చెప్పాల్సిన కథ. ఇందుకు సెన్సబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణును తీసుకోవడం మరో మంచి డెసిషన్. పవన్ గారు తనకున్న సుప్రీమ్ పవర్ స్టార్ అయినా, తనకన్నా ఇతర పాత్రలకు కథలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నా, తనకున్న ఇమేజ్ పక్కన పెట్టి  ఇది నేను చేయాల్సిన సినిమా అని వకీల్ సాబ్ మన ముందుకు తెచ్చిన పవర్ స్టార్ గారికి ఓయ్ వేసుకోండి. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ కోరుతున్నా." అన్నారు.

నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ... "ఇది కరోనా టైమ్ మీరంతా జాగ్రత్తగా ఉండాలి. రేపు థియేటర్లలో వకీల్ సాబ్ సినిమా చూసేందుకు విపరీతంగా జనం రాబోతున్నారు. అందుకే ప్రికాషన్ గా చెబుతున్నాను. పవన్ గారితో గతంలో ఖుషీ, బంగారం చేశాను. ఇప్పుడు మూడో చిత్రం వీరమల్లు చేస్తున్నాను. ఆయన హీరోగానే కాకుండా ఒక వ్యక్తిగా పవన్ గారంటే నాకు చాలా ఇష్టం. పవన్ గారిది చాలా సున్నితమైన మనసు, ఎవరికి ఏదైనా అయితే తట్టుకోలేరు. అంత గొప్ప వ్యక్తి. పవన్ గారు పాలిటిక్స్ లోకి వెళ్లాక తిరిగి చేస్తున్న చిత్రమిది. పవర్ స్టార్ చేస్తున్న సినిమాలన్నీ ప్రజా సేవ కోసమే. ప్రస్తుతం సౌత్ లో ఏ స్టార్ హీరో అయినా సంవత్సరానికి ఒకటే సినిమా చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. సినిమాల కోసం ఇక్కడా ఉంటున్నారు, ప్రజల కోసం ఏపీకి వెళ్తున్నారు. రోజుకు కొన్ని గంటలు కూడా నిద్రపోవడం లేదు. పవన్ గారికి రాబోయే అతి ముఖ్యమైన సినిమాల్లో వకీల్ సాబ్ ప్రధానమైంది. రాజకీయాల్లోకి వెళ్లక ముందు పవన్ గారి ఇమేజ్ వేరు, వెళ్లాక ఇమేజ్ వేరు. ప్రజా సమస్యల మీద పోరాడే పవన్ గారు...ఈ వకీల్ సాబ్ చిత్రంలో ఓ స్త్రీకి జరిగిన అన్యాయంపై న్యాయపరమైన పోరాటం చేశారు. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఖుషీ, గబ్బర్ సింగ్ లాంటి పవన్ గారి హిట్స్ అన్నీ రీమేక్ లే. వకీల్ సాబ్ పింక్ రీమేక్ ..ఈ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుంది. పవన్ గారు రీమేక్ చేస్తే అది రీమేక్ లా ఉండదు. తనకు తగినట్లు మల్చుకుంటారు. పవర్ స్టార్ తో సినిమా చేయాలన్న దిల్ రాజు గారి కల ఈ చిత్రంతో తీరింది. దిల్ రాజు గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇది అన్నింటికన్నా పెద్ద హిట్ కావాలి." అన్నారు.

కస్తుర్బా గాంధీ స్మారక జాతీయ సంస్థ తెలంగాణ ప్రతినిధి, విద్యావేత్త పద్మావతి మాట్లాడుతూ... "నేను మరో ప్రపంచంలో ఉన్నానని అనిపిస్తోంది. నేను సినిమాలు చూసి చాలా కాలమవుతోంది. హిందీలో అమితాబ్ బచ్చన్ గారి పింక్ సినిమా చూశాను. అలాంటి మంచి సందేశాత్మక చిత్రాలు మన దగ్గర ఎందుకు తీయరు అనిపించేది. ఈ వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కించిన నిర్మాత, దర్శకుడు, నటీనటులు అందరికీ అభినందనలు. ఎందుకంటే ఇవాళ్టి సమాజానికి కావాల్సిన చిత్రమిది. ఆడవాళ్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేను కళ్లారా చూశాను. వేల సభలు పెట్టి మేము చెబితే వినని యువత, ఒక పవర్ ఉన్నటువంటి పవర్ స్టార్ చెబితే తప్పకుండా వింటారు అనే నమ్మకం ఉంది. పవర్ స్టార్ కు పవర్ ఫుల్ విజయాన్ని అందిస్తే అదే మీలో వచ్చిన మార్పునకు ఉదాహరణ అనుకుంటాను. ఇలాంటి సందేశాత్మక చిత్రాలు దిల్ ఉన్నటువంటి దిల్ రాజు గారు నిర్మించాలని కోరుకుంటూ. ఇవాళ ఇక్కడికి పిల్చి నాకు సత్కరించడం ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలగజేసింది." అన్నారు.
 
దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... "ఒక బిగ్ ఫిల్మ్ థియేటర్లో చూసి వన్ ఇయర్ అవుతోంది. ఏప్రిల్ 9న అభిమానుల కేకలు అరుపుల మధ్య సినిమా చూసేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు ఇస్తున్న నిర్మాత దిల్ రాజు గారికి, శిరీష్ గారికి థాంక్స్. ఏప్రిల్ 9న పవర్ స్టార్ రియల్ పవర్ ఏంటో చూడబోతున్నాం." అన్నారు.

నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ... "నేను నిర్మాత దిల్ రాజు గారికి ఆల్ ద బెస్ట్ కాకుండా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా తెలిసిపోయింది వకీల్ సాబ్ పెద్ద హిట్ అని. సో టీమ్ మొత్తానికి కంగ్రాట్స్." అన్నారు.

దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ....పవర్ స్టార్ ఫ్యాన్స్ కు హలో. పవన్ గారి చాలా సినిమా కార్యక్రమాల్లో మీ ప్లేస్ లో ఉండి కార్యక్రమాలను ఎంజాయ్ చేశాను. ఇవాళ వేదిక మీద ఉండటం గర్వంగా ఉంది. నన్ను ఇక్కడికి పిల్చిన దిల్ రాజు గారికి, శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. ఒక మంచి పర్పస్ ఫుల్ ఫిలిం తీశారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉండటం గొప్ప విషయం.  ఏప్రిల్ 9న థియేటర్లలో ఒక విజువల్ ఫీస్ట్ కనిపించబోతోంది. విజువల్ ఫీస్ట్ విత్ పర్పస్ ఫుల్ ఫిల్మ్ విత్ పవర్ స్టార్. వకీల్ సాబ్ ను పెద్ద హిట్ చేయండి. థాంక్యూ. అన్నారు.

సాహస బాలిక రుచిత మాట్లాడుతూ...మా స్కూల్ బస్ ట్రాక్ మీద ఆగిపోయింది. డ్రైవర్ అంకుల్ కు చెప్పాము ముందుకు వెళ్లండి అన్నారు. ఆయన వినిపించుకోలేదు. నాకు చేతనైనంత మందిని కాపాడాలని ఒక ఇద్దర్ని కిటికీ లోనుంచి బయటకు పడేశాను. వాళ్లు క్షేమంగా బయటపడ్డారు. నేను దూకుదామని ప్రయత్నించేసరికి ప్రమాదం జరిగిపోయింది. అప్పటి వరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయాను. ఆస్పత్రిలో మెలకువ వచ్చింది. నేను ఇక్కడికి ఈ వేదిక పైకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన మూవీ కార్యక్రమానికి వస్తానని అనుకోలేదు. ఏప్రిల్ 9న అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.  అని చెప్పింది.

నటుడు మీర్ మాట్లాడుతూ...ప్రతి మనిషి జీవితంలో ఏడు అద్భుతాలు ఉంటాయి. దానికి మించిన అద్భుతాలు ఆ మనిషి పూర్వ జన్మలో చేసిన మంచి పనుల వల్ల కలుగుతుంది. నా జీవితంలో గుర్తుండిపోయే ఒక అద్భుతం వకీల్ సాబ్ సినిమా. నేను ఈ సినిమా చేయాలని అనుకున్నది దర్శకుడు శ్రీరామ్ వేణు గారు. ఆయన నాకు ఎంసీఏ సినిమాలోనూ అవకాశం ఇచ్చారు. వకీల్ సాబ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా నాకు గొప్ప అనుభవం. పవర్ స్టార్ గారి ఎనర్జిటిక్ ఫర్మార్మెన్స్, ప్రకాష్ రాజ్ గారి ఎక్సీపిరియన్స్ యాక్టింగ్, నివేదా థామస్ సెటిల్డ్ ఫర్మార్మెన్స్ ఇవన్నీ నేను ప్రత్యక్షంగా సెట్ లో చూడగలిగాను. ఇదంతా నాకు గొప్ప అనుభవం. ఇంత మంచి అనుభూతిని అందించిన నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. వకీల్ సాబ్ దిగ్విజయం సాధించాలి. అన్నారు.


దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ....చాలా రోజుల తర్వాత మనకు వచ్చిన పండగ మనకు వకీల్ సాబ్. మన అందరి తరుపున పవన్ గారికి థాంక్స్. పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు స్టార్ట్ చేసినందుకు ఆయనకు పెద్ద థాంక్స్. ఆయన సినిమాల వల్ల వందల కోట్ల టర్నోవర్ తో తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ నుంచి మళ్లీ కోలుకుంటోంది. వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. లాక్ డౌన్ తర్వాత సినిమా చేస్తున్న ప్రతి హీరోకు, నటీనటులకు, టెక్నీషియన్ కు ఈ వేదిక మీద నుంచి థాంక్స్. టాలీవుడ్ అంతా మన కుటుంబమే అనుకునే వ్యక్తి పవన్ గారు. ఫలానా సినిమా హిట్ అయింది అంటే ఆయన చాలా సంతోషపడతారు. ఆ తర్వాత అడుగుతారు ఎవరి సినిమా అని. ఆయనకు ఎవరి సినిమా అనేది సంబంధం లేదు. అన్ని సినిమాలు హిట్ కావాలి. అందరూ బాగుండాలని పవన్ గారు కోరుకుంటారు. తొలి ప్రేమ వందో రోజు నాకింకా గుర్తుంది. జనం కిటకిటలాడుతూ సంధ్య థియేటర్ లో  రిపీట్ షోస్ పడుతున్నాయి. నేను ఆ గుంపులో షో కు వెళ్లేందుకు వేచి చూస్తున్నాను. అక్కడ కటౌట్ చూస్తూ ఒక కుర్రాడు ఈ హీరోతో సినిమా దర్శకత్వం  చేయాలని అనుకున్నాడు. అక్కడే ఉన్న మరో డిస్ట్రిబ్యూటర్ ఈ హీరోతో సినిమా నిర్మించాలను కల గన్నాడు. దర్శకత్వం చేయాలనుకున్న కుర్రాడిని నేనైతే, సినిమా నిర్మించాలనుకున్న డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు. మా ఇద్దరి కలలు పవర్ స్టార్ చిత్రాలతో తీరాయి. రాజు గారు ఏ కథ విన్నా, క్యారెక్టర్ విన్నా నాకు ఫోన్ చేసి ఈ కథ, క్యారెక్టర్ పవన్ గారికి పడితే నెక్ట్ లెవెల్ ఉంటుంది హరీష్ అంటాడు. పవన్ గారి విషయం వచ్చేప్పటికి రాజు గారు తనో పెద్ద నిర్మాత అనే సంగతి మర్చిపోతారు. ఒక అభిమానిగా మాట్లాడుతారు. శిరీష్ అన్న కూడా పవన్ గారి సినిమా గురించే మాట్లాడుతుంటాడు. పవన్ గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు బాక్సాఫీస్ అంకెలు చూపిస్తా అని అంటుండేవారు. సినిమా మీద రాజన్న, శిరీష్ అన్న ప్యాషన్ అది. ఇక్కడున్న అందరిలో గబ్బర్ సింగ్ సినిమా ఎక్కువ సార్లు చూసింది దర్శకుడు శ్రీరామ్ వేణునే అనుకుంటా. నందాజీ కూర్చొండి చాలు అనే ఒక్క డైలాగ్ చాలు మనం వకీల్ సాబ్ పదే పదే చూసేందుకు. వకీల్ సాబ్ డబ్బింగ్ పూర్తయ్యిన తర్వాత పవన్ గారిని కలిశాను. రాత్రి నుంచి మార్నింగ్ దాకా డబ్బింగ్ చెప్పారట కదా అని అడిగాను. ఆయన రాత్రంతా డబ్బింగ్ చెప్పినా మొహంలో అలసట కనిపించలేదు. ఒక తృప్తి కనిపించింది. మంచి సినిమా చేశాననే సంతోషం కనిపించింది. ఆ సంతోషం ఏంటో ఏప్రిల్ 9న మీరు చూస్తారు. ఏ కీలుకు ఆ కీలు తీసే వకీల్ సాబ్ ను ట్రైలర్ లో చూశాం. థమన్ కెరీర్ బెస్ట్ ఫిలిం వకీల్ సాబ్. అంత బెస్ట్ వర్క్ చేశాడు. పవర్ స్టార్ సినిమా గురించి మీరెంత ఆకలిగా ఉన్నారో నేనూ అలాగే వేచి చూస్తున్నాను. లెట్స్ స్టార్ట్ సెలబ్రేషన్స్ ఆన్ ఏప్రిల్ 9. థాంక్స్. అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ....వకీల్ సాబ్ సినిమా గురించి ఈ సందర్భంలో ఓ మాట చెప్పాలి. సోషల్ మీడియాలో వకీల్ సాబ్ స్టిల్స్, టీజర్, ట్రైలర్ చూసి సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. కథ కొద్దిగా ఉన్న చిత్రాలతోనే పవన్ గారు సూపర్ హిట్స్ కొడుతుంటారు. మరి ఇంత పెద్ద కథ ఉన్న వకీల్ సాబ్ తో ఆయన ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తారో ఊహించుకోవచ్చు. అన్నారు.


దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ....అక్కడుండాల్సిన వాడిని ఇక్కడ ఉన్నాను అంటే కారణం పవన్ గారు. ఎంత పెద్ద సినిమా అయినా వైట్ పేపర్ మీద పెన్ తో రాసినప్పటి నుంచే మొదలవుతుంది. ఆ పని మొదట చేసిన అనిరుధ్ రాయ్ గారికి, సుజిత్ సిర్కార్ గారికి తమిళ్ లో రీమేక్ చేసిన బోనీ కపూర్ గారికి, అజిత్ గారికి పాదాబివనందనం. వారి వల్లే ఈ సినిమాను తెలుగులో చేసుకోగలిగాం. వకీల్ సాబ్ టీమ్ వర్క్, థమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, వినోద్ లాంటి డీవోపీ, రామజోగయ్య అద్భుతమైన సాహిత్యం మా గురువు గారు కదులు కదులు అనే పాట రాశారు. ఇలా జీవితాలు మల్లీ ఇక్కడ కలిశాయి. ఆర్నెళ్లలో చేయాల్సిన సినిమా ఇది. లాక్ డౌన్ వల్ల ఏడాదిన్నర టైమ్ పట్టింది. ఈ టైమ్ లో నాతో కంప్లీట్ గా ట్రావెల్ అయిన బాబీ, తిరు ఇతర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నాతోనే ఉన్నారు. నివేదా, అంజలి, అనన్యను ఏంజెల్స్ అని పిలిస్తుంటారు. ప్రకాష్ రాజ్ గారు ఇతర నటీనటులకు థాంక్స్. దిల్ రాజు గారు త్రివిక్రమ్ గారికి, త్రివిక్రమ్ గారు పవన్ గారి కి రికమెండ్ చేశారు. ఒక రోజు త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి కళ్యాణ్ గారిని కలుద్దాం రండి అన్నారు. ఆయన ఇంటికి వెళ్తే అక్కడ పవన్ గారు ఉన్నారు. అక్కడ తెల్లటి దుస్తుల్లో పవన్ గారిని చూస్తుంటే ఒక గుడిలోకి వెళ్తున్నట్లు ఫీలింగ్ కలిగింది. హిమాలయాల గురించి చదివినప్పుడు ప్రేమతో పాటు భయంగా అనిపిస్తుంది. అవి కరిగితే దేశం మునిగిపోతుందనే భయం. ఈ ప్రేమ భయం అనే రెండు ఫీలింగ్స్ నేను పవన్ గారిని తొలిసారి కలిసినప్పుడు అనుభూతి చెందాను. ఐయామ్ ప్రౌడ్ ఫ్యాన్ ఆఫ్ పీఎస్ పీకే. బలంగా నమ్మిందే విధి అనుకుంటాను. నేను ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది పవన్ గారి యాడ్ కి. సంధ్య థియేటర్లో తొలి ప్రేమ సినిమా చూసిన రాజు గారు, హరీష్ శంకర్ గారితో పాటు నేనూ అక్కడే ఉన్నా. కానీ నేను పవన్ గారి చిత్రానికి దర్శకుడిని అవుతానని అనుకోలేదు. 42 రోజులు వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చేశాం. ప్రతి రోజూ, ప్రతి మీటింగ్, ప్రతి డిస్కషన్ సంతోషంగా సాగింది. డబ్బింగ్ పూర్తయ్యాక నా భుజం తట్టారు. తొలి రోజు నుంచి ఇప్పటిదాకా పవన్ గారితో నేనున్న ప్రతి క్షణం అపురూపమే. సినిమాలో ఉన్నదే కాదు మిగిలిన రష్ కూడా నాకు సంతోషాన్నిస్తుంది. పవన్ గారికి రుణపడి ఉంటాను. ఆయన కోరుకుంటే దేశంలో ప్రతిదర్శకుడు సినిమా చేస్తాడు. ఒక టైలర్ కొడుకును, డిగ్రీ చేసిన వ్యక్తిని నాతో సినిమా చేయడం అదృష్టం. వకీల్ సాబ్ చిత్రం ద్వారా మన జీవితంలో మహిళల గొప్పదనం చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న స్త్రీ మూర్తులకు థాంక్స్. మహిళల పట్ల మీ చూపు మార్చుకోండి. అన్నారు.


నాయిక అంజలి మాట్లాడుతూ....ఈ ఆడిటోరియం చూడటానికి నిండుగా బాగుంది. ఇంతమంది పవర్ స్టార్ అభిమానులను చూడటం సంతోషంగా ఉంది. వకీల్ సాబ్ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు గారికి, దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. కొన్ని క్యారెక్టర్స్ మన లైఫ్ లో గుర్తుండిపోతాయి. వకీల్ సాబ్ లో అలాంటి క్యారెక్టర్ చేశాను. వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడాలంటే పవన్ గారి గురించే మాట్లాడాలి. నా జీవితంలో గుర్తుండిపోయే సంఘటనల్లో పవర్ స్టార్ పవన్ గారితో కలిసి నటించడం ఒకటి. ఆయన మాతో మాట్లాడిన గొప్ప మాటలు మర్చిపోలేను. పవన్ గారు ఒక్కో సీన్ కు ప్రిపేర్ అయిన విధానం గురించి చెబితే టైమ్ సరిపోదు. ఇంతమంచి సినిమా, ఎక్సీపిరియన్స్ వకీల్ సాబ్ తో ఇచ్చినందుకు థాంక్స్ పవన్ గారు. దర్శకుడు వేణు గారికి, నా లక్కీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థాంక్స్. ఆయన బ్యానర్ లో సీతమ్మ వాకిట్లో చిత్రంతో సీతగా పరిచయం చేశారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, థమన్ సంగీతం బ్యూటిఫుల్. మగువా మగువా సాంగ్ నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్. వకీల్ సాబ్ కు ఒక కుటుంబంగా పనిచేశాం. 9న ఆడియెన్స్ సినిమా చూడబోతున్నారు. పవన్ గారిని మూడేళ్ల తర్వాత థియేటర్లో చూస్తున్నారు. వకీల్ సాబ్ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు. సేఫ్ గా సినిమా చూడండి. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ గారితో ఒక ఎమోషనల్ అటాచ్ మెంట్ గురించి చెప్పాలంటే 1998, జులై 24 తేదికి వెళ్లాలి. ఆ రోజు తొలిప్రేమ రిలీజైంది. అప్పుడు చాలా చిన్న డిస్ట్రిబ్యూటర్స్ మేము. తొలి ప్రేమ షూటింగ్ టైమ్ లో వెళ్లి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని, దర్శకుడు కరుణాకరణ్ ను చూసి వచ్చేవాళ్లం.పవన్ గారిని కలిసేంత పరిచయం లేదు. దూరం నుంచి చూసేవాళ్లం. సినిమా విడుదల అయ్యాక వారానికి ఒకసారైనా జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పవన్ గారి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసి వచ్చేవాడిని. ఐదు నిమిషాలు మాట్లాడి వచ్చేవాడిని. నేను మాట్లాడుతుంటే పవన్ గారు అలా వినేవారు. తొలిప్రేమ హండ్రెడ్ డేస్ రోజు సంధ్య 70 ఫుల్ అయితే, 35లో కూడా షో వేశాం. అప్పుడు అనిపించింది నిర్మాత అయితే పవన్ గారితో సినిమా నిర్మించాలి అని. అయితే అప్పటికి డిస్ట్రిబ్యూషన్ లోనే ఉన్నాం ఇంకా ప్రొడక్షన్ లోకి రాలేదు. రత్నం గారు ఖుషి సినిమా డిస్ట్రిబ్యూషన్ మాకు ఇచ్చారు. ఖుషి 50 రోజుల ఫంక్షన్ కు పవన్ గారిని సంధ్య 70 ఎంఎం థియేటర్ కు తీసుకెళ్లాం. అప్పుడు మరోసారి అనిపించింది పవన్ గారితో సినిమా చేయాలని. ఆర్య సినిమా ఓపెనింగ్ కు పవన్ గారు, చిరంజీవి గారు అతిథులుగా వచ్చారు. అప్పుడు మరోసారి అనుకున్నా ఆయనతో సినిమా చేయాలని అని. చాలా సార్లు ఇలా అనుకున్నాం కానీ కుదరలేదు. పవన్ గారికి ఎప్పుడూ చెప్పలేదు మా మనసులో ఉన్నది. గబ్బర్ సింగ్ నైజాం చేశాం. కళ్యాణ్ గారితో సినిమా చేయాలని ఉందని హరీశ్ శంకర్ తో తరుచూ చెప్పేవాడిని. సంకల్పం గొప్పది వేచి చూడు అనేవాడు. ఎప్పుడు అవకాశం వచ్చినా సినిమా చేయాలని గట్టిగా అనుకున్నాను. పవన్ గారు పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు అనే సరికి నా డ్రీమ్ నెరవేరదా అని భయపడ్డాను. కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే చాలు సినిమా చేసేందుకు లైన్ లో చాలా మంది ఉంటారు. ఆయనతో సినిమా నిర్మించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఆయన అనుభవాన్ని చూస్తారు. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశాం. కళ్యాణ్ గారితో చేయాల్సిన సినిమానే పెండింగ్ లో ఉండేది. ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూశాను. ఆ అవకాశం పింక్ రూపంలో వచ్చింది. పింక్ రైటర్స్, దర్శకుడు చేసిన ప్రయత్నమే ఈ స్టేజీ దాకా వకీల్ సాబ్ సినిమాను తీసుకొచ్చింది. బోనీ కపూర్ గారు తమిళ పింక్ సినిమా ట్రైలర్ పంపారు. అది చూస్తున్నంత సేపూ నాకు పవన్ కళ్యాణ్ గారే కనిపించారు. ఇది కళ్యాణ్ గారు చేస్తే భలే ఉంటది అనుకున్నాను. కానీ ఆయన అప్పటికి పాలిటిక్స్ లోనే ఉన్నారు. సినిమాలు చేస్తరో లేదో అనే డిస్కషన్ లోనే ఉన్నారు. బోనీ గారు తమిళ్ లో పింక్ చేశారు కాబట్టే తెలుగులో మేము చేయాలనే ఆలోచన వచ్చింది. హరీష్ కు తమిళ్ పింక్ ట్రైలర్ పంపితే ఆయన కూడా అతను కూడా పవన్ చేస్తే బాగుంటది అని చెప్పారు. అయినా పన్ గారి దగ్గరకు వెళ్లే వీలు దొరకలేదు. ఒకరోజు అల వైకుంఠపురములో సినిమా సెట్స్ కు వెళ్లి త్రివిక్రమ్ గారితో ఐడియా చెప్పాను. ఆయన పవన్ గారి టైమ్ తీసుకుని మేము కలిసేలా చేశారు. త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ ప్రాసెస్ లో ఏది మిస్ అయినా ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చేది కాదు. మా కల నెరవేరేలా చేసిన హిందీ పింక్ మేకర్స్, బోనీ కపూర్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ గారు ఈ నలుగురికీ థాంక్స్. దర్శకులు ఎవరేనిది ఇద్దరు ముగ్గర్ని అనుకున్నాం. కానీ పింక్ రీమేక్ అంటే ఇది సరిపోదు ఇంకా ఏదో కావాలని అనిపించింది. త్రివిక్రమ్ గారితో కొంతసేపు డిస్కషన్ తర్వాత నాకు శ్రీరామ్ వేణు పేరు స్ట్రైక్ అయ్యింది. ఎంసీఏ తర్వాత ఇంకో సినిమా అనుకున్నాం. అది డిలే అవుతూ వచ్చింది. వేణును ఆఫీస్ కు పిలిచి నీకో సర్ ప్రైజ్ చెప్తాను అన్నాను. పింక్ తెలుగులో పవన్ గారితో చేస్తున్నాం. నువ్వు డైరెక్ట్ చేస్తావా అన్నాను. వెంటనే వేణు జోకులు చేయకండి సార్ అన్నాడు. సార్ నేను పవన్ గారికి ఎంత పెద్ద అభిమానినో మీకు తెలుసు. మీరు అవకాశం ఇస్తే ఈ నిమిషం నుంచే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తా అన్నాడు. ఇంకా ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవకముందే రోజూ వచ్చి సీన్స్ చెప్పేవాడు. ఈ సీన్ ఇలా ఉంటది సార్, పవన్ గారి క్యారెక్టర్ ఇలా చేద్దాం అని చెప్పేవాడు. చివరకు తన ఉత్సాహంతో ఈ సినిమాకు దర్శకుడు అయ్యారు. ఈ సినిమా ప్రకటించగానే నెగిటివ్ పాజిటివ్ రెండూ వచ్చాయి. మా హీరోతో ఇలాంటి సినిమానా అన్న అభిమానులూ ఉన్నారు. కానీ సినిమా ఒప్పుకున్నాక పవన్ గారు మాతో ఒకటే ఒక మాటన్నారు. ఇది గొప్ప కథ, ఈ కథలో నా ఇమేజ్ సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే ఒక మ్యాజిక్ అవ్వుద్ది అన్నారు. మీకు ట్రైలర్ లాంచ్ రోజు చెప్పాను. ఇది బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అని, లంచ్ డిన్నర్ రిలీజ్ రోజు ఉంటది. సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక హైలైట్ ఉంటది. మీరు పేపర్స్ పట్టుకుని రెడీగా ఉండండి. పింక్ లోని కథను, పవన్ గారి ఇమేజ్ ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ వేేణు సూపర్బ్ గా తెరకెక్కించారు. కళ్యాణ్ గారు ఓ చిన్న బ్రేక్ తీసుకుని తెరపైకి వస్తున్నారు. ఏప్రిల్ 9న మనమంతా పండగ చేసుకునేరోజు. కాలర్స్ ఎగరేసే రోజు అది. కళ్యాణ్ గారితో ఒక గొప్ప సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. మా ప్యాషన్ గురించి మీరు చెబుతుంటారు. చిన్న డిస్ట్రిబ్యూటర్స్ నుంచి 50 సినిమాలు చేసే నిర్మాణ సంస్థగా ఎదిగాం. మీ ఎంకరేజ్ మెంట్ కు థాంక్స్. థమన్ ఒక పిచ్చోడిలా ఈ సినిమాకు పనిచేశాడు. నో కాంప్రమైజ్ అంటూ పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఇవాళ ఉదయం వరకు పనిచేస్తూనే ఉన్నాడు థమన్. పవన్ గారి ఇమేజ్ ను గుర్తుపెట్టుకుని మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు. పవన్ గారితో నాకు పెద్దగా సాన్నిహిత్యం లేదు. ఈ మధ్య పవన్ గారు పిలిచి మాట్లాడారు. ఆయన చెప్పిన రెండు మాటలు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మనసుతో ఆలోచించినప్పుడే అది అర్థమవుతుంది. అని చెమ్మగిల్లిన కళ్లతో అన్నారు.

 
నాయిక అనన్య నాగళ్ల మాట్లాడుతూ....ఈ కార్యక్రమంలో మాట్లాడాలని బాగా ప్రిపేర్ అయ్యాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదీ గుర్తుకురావడం లేదు. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. నాలాగా చాలా అమ్మాయిలు కలను నెరవేర్చుకునేందుకు ఇండస్ట్రీకి వస్తారు. ఇంట్లో వాళ్లు వద్దంటారు.ఇక్కడా రిజెక్షన్స్ వస్తాయి. తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు రావు అని చెబుతుంటారు కానీ. వకీల్ సాబ్ సినిమా మాలాంటి తెలుగు అమ్మాయిలకు ఒక హోప్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు గారికి థాంక్స్. దర్శకుడు శ్రీరామ్ వేణు గారు నన్ను తమ ఇంట్లో ఒక అమ్మాయిలా చూసుకున్నారు. బొమ్మరిల్లు సినిమా చూశాక ఇలాంటి ప్రొడక్షన్ లో ఎప్పుడు పనిచేస్తానా అనుకున్నాను. వకీల్ సాబ్ తో ఆ కోరిక నెరవేరింది. పీఎస్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ మమ్మల్ని చాలా బాగా చూపించింది. అంజలి గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సెట్ లో అంజలి గారు చాలా ఫన్ క్రియేట్ చేసేవారు. నివేదా ఇక్కడ లేకపోవడం బాధగా ఉంది. ఆమె నాకు చాలా సపోర్ట్ చేసింది. వకీల్ సాబ్ డిపార్ట్ మెంట్ అందరికీ థాంక్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించిన వకీల్ సాబ్ జర్నీని జీవితాంతం గుర్తుంచుకుంటాను. పవన్ గారి దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాను. షూటింగ్ టైమ్ లో ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. అన్నారు.


సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ గారితో ఇలాంటి గొప్ప సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు గారికి థాంక్స్. ఇది 126 సినిమాల వెయిటింగ్, 20 ఏళ్లు వేచి చూసిన కల. నాకు వకీల్ సాబ్ రెండున్నర గంటల సినిమా సరిపోలేదు మ్యూజిక్ చేసేందుకు. ఇంకా కోరిక అలాగే ఉంది. నా రాత మార్చిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా నాకే ఇప్పించారు. అందులో మాస్ పాటలు చేస్తానని మాటిస్తున్నా. మా అమ్మను తీసుకెళ్లి గర్వంగా చూపించే సినిమా వకీల్ సాబ్. పవన్ గారి మీద నాకున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ, కసి, ఎమోషన్ అంతా  కీబోర్డ్ మీద చూపిస్తాను. నేను నా టీమ్ అంతా గత 36 రోజులుగా సరిగ్గా నిద్రపోకుండా పనిచేస్తున్నాము. ఏప్రిల్ 9న మీరంతా సినిమా చూడాలనేది నా కోరిక. మీరు తప్పకుండా వకీల్ సాబ్ సినిమా చూడాలి. థియేటర్లో మీరు రెప్పవాల్చకుండా సినిమా చూస్తారనే హామీ ఇస్తున్నా. వకీల్ సాబ్ సినిమాకు పనిచేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. ఇందులో మగువా మగువా లాంటి పాట, కదులు కదులు, సత్యమేవ జయతే లాంటి పాటలు హృదయాన్ని కదిలిస్తాయి. పాలిటిక్స్ లో వచ్చేప్పుడు పవన్ గారు ఇచ్చిన ఫస్ట్ స్పీచ్ నాకింకా గుర్తుంది. ఆ స్పీచ్ స్ఫూర్తితోనే సత్యమేవ జయతే పాట కంపోజ్ చేశాం. ఇందులో కెవ్వు కేక లాంటి మాస్ పాటలు ఉండవా అని అడుగుతున్నారు. ఆ పాటలు చేయాలంటే రాత్రి కంపోజ్ చేస్తే తెల్లారికి రికార్డ్ అవుతాయి. కానీ ఇలాంటి పాటలు మనసుతో చేయాలి. వకీల్ సాబ్ సిగరెట్ల్ వెలిగించుకునే సినిమా కాదు ఇంట్లో దీపాలు వెలిగించే సినిమా. రామజోగయ్య శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు ఆయనకు థాంక్స్. అన్నారు.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ.....ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా...పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే వదలలేం. కొందరిని ఇష్టపడటమే గానీ వదులుకోవడం ఉండదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి మీరు పదో తరగతి బాగా పాసయ్యారు అంటే కింద నుంచి పై దాకా చూస్తారు. పవన్ గారికి హిట్స్, సూపర్ హిట్స్ అంతే. ఆయన చూడని విజయాలా, ఆయన సాధించని రికార్డులా, ఆయన చూడని బ్లాక్ బస్టర్లా, ఆయన సృష్టించని చరిత్రలా, ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం అంతే. పవన్ గారు కొత్త చరిత్ర కోసం అడుగులు వేస్తున్నారు. ఇటు సినిమాలూ చేస్తున్నారు. చేయాలి కూడా. ఒక ఫ్రెండ్ నాతో అన్నాడు ఏరా మీ బాస్ సినిమాలు అంటాడు రాజకీయం అంటాడు అని. నేను చెప్పాను. ఒరేయ్ ఆయనకు మనలా పాల వ్యాపారం, మందు వ్యాపారం, కోళ్ల వ్యాపారం ఇలాంటివేవీ తెలియదు. ఆయనకు తెలిసిందల్లా బ్లడ్ వ్యాపారం. రక్తాన్ని చెమటగా మార్చి, ఆ చెమటతో నటించి మనకు సంతోషాన్ని కలిగిస్తుంటారు అన్నాను. కష్టాల్లో ఉన్న వారికి తను చెమటోడ్చి సంపాదించిన కోటి రూపాయలతో ఇన్సురెన్స్ చేయించిన గొప్ప వ్యక్తి ఆయనరా అని నా ఫ్రెండ్ ను తిట్టాను. పవన్ గారి నిజాయితీ ఏంటో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. అంజనీ పుత్ర పావన సుతనామ అని ఊరికే అనలేదు. చాలా మంది పుడతారు గిడతారు. కొందరే చరిత్రలో మిగిలిపోతారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ సినిమా వెనక సినిమా చేస్తూ ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. అదీ పవన్ కళ్యాణ్. పవన్  గారికి ఏదో ఒకటి చెప్పి బుట్టలో వేద్దాం అని వెళ్తాను. ఆయన దగ్గరకు వెళ్లి ఆయన కళ్లు చూడగానే అన్నీ మర్చిపోతాను. ఆ కళ్లలో అంత నిజాయితీ ఉంటుంది. నేను నిజంగా పవన్ కళ్యాణ్ భక్తుడినే. ఏడుకొండల వాడికి అన్నమయ్య, శివయ్యకు భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవర్ స్టార్ కు బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా. పవన్ గారికి పొగరు అన్న ఓ వ్యక్తికి...పాక్ గడ్డమీద ఆ సైనికులకు దొరికి చిత్ర హింసలు పెట్టినా మన దేశ రహస్యాలు చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసం కట్టుకున్నంత పొగరు పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్పా. చైనాతో యుద్ధంలో ఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికి ఉన్నంత పొగరు ఉందని చెప్పా. ఛత్రపతి శివాజీ కత్తికి ఉన్న పదునంత పొగరు అని చెప్పా. బ్రిటీష్ సామ్రాజ్యపు జెండా దించేసి, ఎర్రకోట మీద ఎగిరిన మువ్వన్నెల జెండాకున్నంత పొగరుందని చెప్పా. భారత రాజ్యాగంలో అంబేద్కర్ చేతి రాతకున్నంత పొగరుందని చెప్పా. యవ్వనంలో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ దేశభక్తిలో ఉన్నంత పొగరుందని చెప్పా. పరశురాముడి గొడ్డలికున్నంత పదును, శ్రీరాముడు విడిచిన బాణంలోని పదునంత పొగరుందని చెప్పా. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంలోని పదునంత పొగరుందని చెప్పా. అన్నింటికంటే జై పవర్ స్టార్ అని అరిచే అభిమాని గుండెకున్నంత పొగరుందని చెప్పా. మై నేమ్ ఈజ్ బండ్ల గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. అన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ....నా గుండె చప్పుళ్లయిన నా అభిమానులకు, ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెల్లు, అన్నదమ్ములకు, టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా ఫంక్షన్ చేసి చాలా సంవత్సరాలు అయ్యింది. బండ్ల గణేష్ లా మాట్లాడలేం కదా. పొలిటికల్ సభలైతే మాట్లాడొచ్చు గానీ ఇక్కడకొచ్చి ఎక్కువ మాట్లాడలేం. మూడు సంవత్సరాలు నేను సినిమా చేయలేదు అనే భావన కలగలేదు. ఎప్పుడూ నా మనసు, హృదయం దేశం కోసం, మీ కోసం కొట్టుకుంటాయి. ఒక పుస్తకం చదివినా, ఒక వాక్యం చదివినా దేశం కోసమే అనిపిస్తుంటుంది. కాబట్టి మూడు సంవత్సరాలు నేను సినిమాకు దూరంగా ఉన్నానంటే ఆ కాలం నాకు తెలియలేదు. సినిమా పరిశ్రమకు వచ్చి 24 ఏళ్లవుతుంది అని మీరు అంటుండగా వినడమే గానీ నాకు అసలు గుర్తు లేదు. పని చేసుకుంటూ వెళ్లిపోయాను గానీ తెలియదు. తెలుగు చిత్ర పరిశ్రమలో మహోన్నత స్థానానికి వెళ్లిన నిర్మాత దిల్ రాజు నాతో సినిమా చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే.. నేను ఎప్పుడూ కలలు కనే వారిని ఇష్టపడతాను. ఏదైనా సరే ఒక కల కనాలి. నేను ఇది సాధిస్తాను, నేను ఈ స్థాయికి వెళ్తాను అని కలలు గనే వారంటే నాకు ఇష్టం. గుంటూరు శేషేంద్ర శర్మ అన్నట్లు "కలలు కను కలలు కను కలలు కను.. నీ కలల్ని తొక్కేస్తున్న పాదాల్ని ఖండించే వరకు కలలు కను" అనే మాటలు నాకు చాలా ఇష్టం. దిల్ రాజు గారు ఎన్నో కలలు గన్నారు. 'తొలి ప్రేమ' షూటింగ్ టైమ్ ల�


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.