పవన్ ఈసారైనా సంక్రాంతికి పవర్ చూపిస్తాడా?
on Feb 28, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ పిరియడ్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి వాతావరణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనున్నారు పవన్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించి.. తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 2022 సంక్రాంతికి ఈ పాన్ - ఇండియా మూవీ విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. సంక్రాంతి సీజన్ లో వచ్చిన పవన్ చిత్రాలేవీ ఆశించిన విజయం సాధించలేదు. 'బాలు' (2005), 'గోపాల గోపాల' (2015), 'అజ్ఞాతవాసి' (2018).. ఇలా ముగ్గుల పండగ సమయంలో వచ్చిన పవన్ చిత్రాలన్నీ బాక్సాఫీస్ ని మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో క్రిష్ డైరెక్టోరియల్ తోనైనా పవన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకుని పవర్ చూపిస్తారేమో చూడాలి.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
