అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆస్కార్ బెస్ట్ పిక్చర్
on Mar 22, 2020
ఈ ఏడాది అకాడమీ అవార్డుల్లో బెస్ట్ పిక్చర్‌గా ఆస్కార్‌ను అందుకున్న కొరియన్ మూవీ 'పారసైట్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నది. ఇండియాలో ఆ సినిమా జనవరి 31న థియేటర్లలో విడుదలైంది. ఒక సంపన్న కుటుంబంలో పనివాళ్లుగా చేరడానికి ఒక పేద కుటుంబం సాగించే జీవన పయనాన్ని సెటైరికల్‌గా చూపిస్తూ బాంగ్ జూన్-హో డైరెక్ట్ చేసిన సినిమా 'పారసైట్'.
ఈ నెల 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ఈ మూవీని కొరియన్ భాషలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తిలకించవచ్చు. ఇండియాలో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరడానికి వీలుగా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఇది ప్రైమ్ వీడియో ఇండియాలో అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది జరిగిన ఆస్కార్ వేడుకలో 'పారసైట్' నాలుగు అవార్డులను అందుకుంది. అవి.. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు, జాను, దర్బార్ (తెలుగు), వెంకీమామ, మహర్షి, సాహో, మత్తు వదలరా, డియర్ కామ్రేడ్, నానీస్ గ్యాంగ్ లీడర్, జార్జిరెడ్డి, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, ఎఫ్2, ఫలక్‌నుమా దాస్, వార్ (తెలుగు), సైరా, ఎవరు వంటి ఆసక్తికర చిత్రాలు అందుబాటులో ఉన్నాయి.
Also Read