ఊపిరి రీమేక్ లో అమితాబ్ చేస్తున్నారా..?
on Apr 15, 2016
తెలుగు సినిమాల ట్రెండ్ మారుతోందని చూపించిన సినిమా ఊపిరి. కేవలం నాగార్జున కే కాక, సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు తీసుకువచ్చిందీ మూవీ. ఇన్ టచిబుల్స్ సినిమా ఫ్రెంచి లో ఎంత భారీగా హిట్టయిందో, తెలుగు తమిళ భాషల్లో కూడా అంతే బాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు బాలీవుడ్ హక్కుల్ని కరణ్ జోహార్ చేజిక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అంతే కాక, నాగార్జున పాత్రను అమితాబ్ బచ్చన్, కార్తి పాత్రను వరుణ్ ధావన్ చేయబోతున్నాడంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. అమితాబ్ ఇప్పటికే పీకూలో ఆనారోగ్యంగా ఉండే పాత్ర పోషించారు. పా, పీకూ, షమితాబ్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అమితాబ్. అందుకే ఈ పాత్రకు ఆయనైతేనే కరెక్ట్ గా ఉంటారని, న్యాయం చేయగలరని కరణ్ భావిస్తున్నాడట. తెలుగులో తెరకెక్కించినట్టే, సెన్సిటివ్ ఫీలింగ్స్ ను కరెక్ట్ గా ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తే, బాలీవుడ్ లో కూడా ఊపిరి సూపర్ హిట్ కొట్టే అవకాశం లేకపోలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read