మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో నాగశౌర్య
on Dec 4, 2020
జయాపజయాలతో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుడు కావలెను, లక్ష్య చిత్రాలు చేస్తున్నారు. వీటిలో వరుడు కావలెనుని డెబ్యూ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కిస్తుండగా.. లక్ష్యని సంతోష్ జాగర్లపూడి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రథమార్ధంలో థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.
ఇదిలా ఉంటే.. అనీష్ కృష్ణ దర్శకత్వంలోనూ నాగశౌర్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నాగశౌర్య హోమ్ బేనర్ ఐరా క్రియేషన్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పాప్ సింగర్ షెర్లీ సేటియా నాయికగా నటించనుంది. కాగా ఈ సినిమాకి శ్రీకృష్ణ - సత్యభామ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. శౌర్య గత చిత్రాలు @నర్తనశాల, అశ్వథ్థామ తరహాలో.. టైటిల్ లో మైథలాజికల్ టచ్ ఉన్నా.. ఇది కూడా సోషల్ డ్రామాగానే తెరకెక్కనుండడం విశేషం. త్వరలోనే ఈ టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.