స్వామి దర్శనం ఇంత తొందరగానా ??
on Jul 28, 2016
తిరుపతి వెళ్ళి ఏడు కొండలు ఎక్కి.. గంటల తరబడి లైన్లో నిల్చోని మరీ వెంకటేశుని దర్శనం చేసుకొంటేనే కానీ "కిక్" ఉండదు. సినిమాల విషయంలోనూ అంతే.. సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మొదలుకొని ట్రైలర్, సినిమా రిలీజ్ వంటివి లేట్ చేసేకొద్దీ క్రేజ్ పెరుగుతుంటుంది. కానీ.. నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం "ఓం నమో వెంకటేశాయ" విషయంలో మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది.
సినిమా ప్రారంభం రోజునే నాగార్జున గెటప్ ను రివీల్ చేసేశారు. షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేసేశారు. రెంటికీ పెద్దగా స్పందన లభించలేదు. విపరీతంగా ఎగ్జైట్ చేయడానికి ఇదేమీ యాక్షనో లేక హారర్ సినిమాలో కాకపోయినప్పటికీ.. ఒక బడా స్టార్ హీరో సినిమా అంటే జోనర్ తో సంబంధం లేకుండా జనాల్లో ఒక ఉత్సుకత ఉంటుంది. దాన్ని అందుకోలకపోయినా కనీసం వారిని అలరించే స్థాయిలో అయినా ఉండాలి. కానీ.. నాగార్జున అండ్ గ్యాంగ్ మాత్రం అప్పుడే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఈమేరకు ట్విట్టర్ లో అప్పుడే ఓ ప్రీ-లుక్ పోస్టర్ కూడా విడుదల చేసేశారు. మరి ఈ ఫస్ట్ లుక్ అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి!