లైలా కోసం చైతు పోరాటం
on Apr 19, 2014
నాగచైతన్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఒక లైలా కోసం". విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఓ అమ్మాయి ప్రేమని పొందడానికి అబ్బాయి చేసిన ప్రేమ పోరాటమే ఈ చిత్రం. సినిమా అంతా సందడిగా, వినోదాత్మకంగా సాగుతుంది. మరో నెల రోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది అని చిత్ర యూనిట్ చెబుతున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.