ఎన్టీఆర్, చరణ్ లని యుఎస్ పంపించిన రాజమౌళి... అందుకోసమే..
on Mar 8, 2018
రాజమౌళి కి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరు ఉంది. తన సినిమాలో క్యారెక్టర్ లని డిజైన్ చేయడంలో మరియు వాటిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో జక్కన్న స్టయిలే వేరు. బాహుబలి సిరీస్ తో తన సత్తా ఏంటో చాటిన రాజమౌళి, తన తదుపరి చిత్రం గా ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయనున్నాడు. ఆగష్టు చివరలో కానీ, సెప్టెంబర్ లో కానీ ఈ సినిమాని పట్టాలపైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నాడు. ప్రస్తుతం, జక్కన్న ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.
ఈ మధ్యలో చరణ్, ఎన్టీఆర్ లని తన సినిమా కోసం సన్నద్ధం చేసే పనిలో ఉన్నాడు. నిన్న, వీరిద్దరిని మేకప్ వర్క్ షాప్ కోసం అమెరికా పంపించాడు. సినిమాకు సంబంధించిన విషయాలన్నీ గోప్యంగా ఉంచుతున్న రాజమౌళి, మరో బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కించేందుకు తన అస్త్రాలన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఆర్టిస్ట్ ల గెటప్ దగ్గరి నుండి, ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రతి సినిమా మొదలెట్టే ముందు, లైన్ స్టోరీ మీడియాకి వివరించే అలవాటు ఉన్న జక్కన్న, ఈ సారి అలా చేస్తాడో లేదో చూడాలి!