English | Telugu

అంతర్మథనంలో 'NTR' అభిమాన గణం...

on Jan 18, 2019

సంక్రాంతికి విడుదలైన తొలి సినిమా 'యన్.టి.ఆర్ కథానాయకుడు'. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇంకేముంది? సినిమా సూపర్ హిట్ అనుకున్నారంతా! అయితే వసూళ్లు మాత్రం ఆశించిన రీతిలో లేవు. పంపిణీదారులుకు నష్టాలు వచ్చేలా వున్నాయని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో 'యన్.టి.ఆర్' అభిమాన గణం అంతర్మథనంలో పడింది.

టాక్ బావుంది కానీ వసూళ్లు ఎందుకు రావడం లేదని నందమూరి, తెలుగుదేశం అభిమానులు లోలోపల మథన పడుతున్నారు. అభిమానుల్లో ఈ అంశమే ఎక్కువగా చర్చకు వస్తుందట. చిత్రబృందంలో ముఖ్యులు కూడా ఆ అంశమై తీవ్రంగా ఆలోచిస్తున్నారని భోగట్టా. ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ విషయంలో ఇలా జరగకూడదని రీషూట్లు చేస్తున్నారట! ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సన్నివేశాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారట. అందుకని 'యన్.టి.ఆర్ మహానాయకుడు' విడుదల తేదీని ఫిబ్రవరి తొలి వారం నుంచి రెండో వారంలో 16కు వాయిదా వేశారని టాక్.

ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగం కథానాయకుడులో సినిమా విషయాలు ఎక్కువ చూపించారు. సినిమాల నుంచి రాజకీయాలవైపు ఎన్టీఆర్ అడుగులు పడటానికి ప్రేరేపించిన అంశాలను చూపించారు. రెండో భాగం మహానాయకుడు పూర్తిగా రాజకీయ కోణంలో వుంటుందని చిత్ర బృందం ముందే చెప్పిన నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఎవరి పాత్రలను ఎంతవరకూ చూపిస్తారు? ఎలా చూపిస్తారు? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.