ఎన్టీఆర్ 'మహానాయకుడు' vs వైయస్సార్ 'యాత్ర'
on Dec 15, 2018
వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'యాత్ర'. మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ఉదయం ప్రకటించారు. నిజానికి, తొలుత ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలని భావించారు. తరవాత జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఫీలర్లు వదిలారు. ఇప్పుడు ఫిబ్రవరి 8 అన్నారు. దీనికి కారణం... ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'మహానాయకుడు'ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకోవడమే. 'మహానాయడు'లో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. 'యాత్ర'లో వైయస్సార్ పాదయాత్రను హైలైట్ చేస్తున్నారు. రెండు సినిమాల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు వున్నాయి. 'ఎన్టీఆర్ మహానాయకుడు' విడుదల కంటే ముందు 'యాత్ర' ప్రేక్షకుల ముందుకు రావడం కంటే ఆ సినిమాతో పోటీగా వస్తే.. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం వుంటుంది. అందుకని, 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో పోటీకి వైయస్సార్ 'యాత్ర' సిద్ధమవుతోందని టాక్!!