ఎన్టీఆర్‌ని తొక్కేయడానికే బయోపిక్ తీస్తున్నారా?
on Apr 10, 2018
ఎన్టీఆర్ బయోపిక్‌పై అందరి దృష్టీ పడింది. బాలయ్య ఎన్టీఆర్ గా కనిపించే చిత్రమిది. తండ్రి జీవిత కథపై తెరకెక్కుతున్న ఓ చిత్రంలో తనయుడు కనిపించడం నిజంగా గొప్ప విషయమే. బాలయ్యతో పాటు ఈ సినిమాలో ఎవరెవరు కనిపిస్తారన్న ఆసక్తి నెలకొంది. నందమూరి ఇంట్లో నటులకు కొదవలేదు. కల్యాణ్‌రామ్, తారకరత్న, హరికృష్ణ .. వీళ్లంతా ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ చైతన్యరథానికి హరికృష్ణ సారధి. ఆ పాత్రని కల్యాణ్ రామ్ చేస్తున్నాడట. హరికృష్ణకూ, తారకరత్నకూ ఇందులో అవకాశం దక్కిందని తెలుస్తోంది. కల్యాణ్‌రామ్ తనయుడు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడని సమాచారం. బాలయ్య వారసుడు మోక్షజ్క్ష కూడా చిన్న పాత్రలో కనిపించే అవకాశం ఉంది. నందమూరి వారసులంతా ఈసినిమాలో కనిపించడం ఖాయం. ఒక్క ఎన్టీఆర్ తప్ప. జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి వారసుడే కదా? నిజానికి వారసులందరిలోనూ ఆయనకే ఎక్కువ స్టార్ డమ్ ఉంది. అలాంటి ఎన్టీఆర్‌ని బయోపిక్ లో పక్కన పెట్టేయడం న్యాయమా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే ఎన్టీఆర్ మాత్రం `బాబాయ్ పిలిచి అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తా` అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎన్టీఆర్ నుంచి లైన్ క్లియర్ అన్నమాట. బాబాయ్ నుంచే పిలుపు రాదు. మొత్తానికి ఎన్టీఆర్ మనవడు... ఎన్టీఆర్ పోలికలతో పుట్టిన వాడు, ఎన్టీఆర్ పేరే పెట్టుకున్న వాడు ఎన్టీఆర్ బయోపిక్‌లో కనిపించడన్నమాట.