ఆమె రాకతో బాలీవుడ్ చూపు ఎన్టీఆర్ బయోపిక్ వైపు
on Mar 12, 2018
నందమూరి బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు, మూడు నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం క్యాస్టింగ్ ఫైనలైజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యారెక్టర్ కోసం మొదట నిత్య మీనన్ ని అడిగిన విషయం తెలిసిందే. కానీ, కొన్ని కారణాల వల్ల నిత్య సినిమా చేసేందుకు నిరాకరించింది. ఈ మధ్యలో మరి కొందరు హీరోయిన్స్ అనుకున్నా, ఏది సెట్ అవ్వలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఎన్టీఆర్ బయోపిక్ లో నటించేందుకు పచ్చ జెండా ఊపిందని సమాచారం. దక్షిణాది నుండి వెళ్లిన విద్యా బాలన్ కి ఎన్టీఆర్ ఎంత పెద్ద లెజెండో తెలుసు. తెలుగులో డెబ్యూ చేయడానికి ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు కాబట్టి వెంటనే ఓకే చెప్పేసిందట. ఇక ఎన్టీఆర్ బయోపిక్ దర్శక, నిర్మాతలకి విద్యా బాలన్ రాక పెద్ద ఊరట. ఇప్పుడు బాలీవుడ్ కళ్లన్నీ ఈ సినిమా పై పడటం ఖాయం. హిందీ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విద్యా, ఎన్టీఆర్ బయోపిక్ చేయడం బిజినెస్ పరంగా కలిసొచ్చే అంశం అంటున్నారు. అందుకే, ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సైన్ చేశారట. సో, ఎన్టీఆర్ బయోపిక్ హిందీ లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.