ఫస్ట్‌లుక్‌తో సరిపెట్టేశారు.. ఎన్టీఆర్ టీజర్ లేనట్లేనా..?
on Jan 18, 2018
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్లో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ నటిస్తుండగా.. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు దీనిపై ఎన్ని కాంట్రవర్సీలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు పోటీగా రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎనౌన్స్ చేయగా.. దీనికి కౌంటర్‌గా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథాన్ని తీస్తున్నట్లు ప్రకటించడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ జీవితాన్ని ఏ కోణం నుంచి చూపిస్తారు.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జరిగిన వివాదాలకు ఇందులో చోటు దక్కుతుందా.. ఇలా ఎన్నో డౌట్స్.. వీటన్నింటిని పక్కనబెట్టి బాలయ్య షూటింగ్ స్టార్ట్ చేసేశాడు.
సెట్స్ మీదకు వెళ్లిన తొలి రోజే టీజర్ కోసం షూటింగ్ చేశామని.. దీనిని అన్నగారి వర్థంతి రోజు రిలీజ్ చేస్తామని ప్రకటించారు కూడా.. కానీ ఎన్టీఆర్ టీజర్ వచ్చిన జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే టీజర్‌కు సంబంధించిన వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉందని .. అందుకే దీనిని వాయిదా వేసినట్లు టాలీవుడ్ టాక్. అయితే నిన్న రాత్రి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ రిలీజ్ అయ్యింది.. చైతన్య రథంపై అన్నగారు నిలుచుని ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ బయోపిక్‌లో రాజకీయాల ప్రస్తావన ఉండదని ప్రచారం జరిగినప్పటికీ.. ఫస్ట్‌లుక్ చూస్తుంటే సినిమా మొత్తం పొలిటిక్స్ చుట్టూనే తిరుగబోతోందని ఫిలింనగర్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి టీజర్‌కు ముహుర్తం కుదరలేదన్న మాట.