యుఎస్‌లో ఆ హీరోకి అంత క్రేజా!!!
on Oct 3, 2018
క్రేజీ హీరో విజయ్ దువరకొండ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం `నోటా`. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 5వ తేదిన `నోటా` విడుదల కానుంది. ప్రస్తుతం విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది. అయితే తాజాగా ఈ చిత్ర యు.ఎస్.లో రికార్డు స్థాయిలో విడుదల అవ్వబోతుంది. దాదాపు 220 లోకేషన్స్ లో విడుదల కానుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇన్ని లోకేషన్స్ లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచిస్పందన లభించింది. `ఇరుముగన్` ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రామా లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులుల సత్యరాజ్,నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.