రామ్‌చరణ్‌కు అలా.. అజయ్ దేవ్‌గణ్‌కు ఇలా!
on Apr 2, 2020
ఏప్రిల్ 2 అజయ్ దేవ్‌గణ్ పుట్టినరోజు. ఈ రోజు ఆయన ఫస్ట్‌లుక్‌తో 'ఆర్ఆర్ఆర్' టీమ్ తమకు ట్రీట్ ఇస్తుందనుకున్న అజయ్ ఫ్యాన్స్ ఆశలు నెరవేరలేదు. దాంతో ఆయన పుట్టినరోజు ఎలాంటి సర్ప్రైజ్ లేకుండానే గడిచిపోయింది. అజయ్ బర్త్‌డే సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఒకరోజు ముందు నుంచే అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. కానీ దానికి బదులుగా సినిమా టీమ్ నుంచి ఒక వివరణ మాత్రం వచ్చింది.
మూవీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో అజయ్ దేవ్‌గణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిత్ర బృందం ఆర్ఆర్ఆర్ మూవీలో ఆయన ఒక భాగం కావడం గొప్ప గౌరవంగా పేర్కొంది. "మీతో ఫస్ట్ షెడ్యూల్ చేయడం మరపురాని అనుభవం. మీకూ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాం. మరో అద్భుతమైన సంవత్సరం మీ ముందుంది" అని పోస్ట్ చేసింది.
ఆ వెంటనే "అజయ్ దేవ్‌గణ్ గారి బర్త్‌డే సందర్భంగా ఒక వీడియో, ఫస్ట్‌లుక్‌తో మీకు ట్రీట్ ఇవ్వాలనుకున్నాం. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో మ్యూజిక్, డీఐ పూర్తిచేసే ప్రాసెస్‌లో ఆటంకం ఎదురైంది. లాక్డౌన్ ముగిశాక అప్డేట్స్ అందిస్తాం" అని అభిమానులను ఉద్దేశించి మరో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌కు అజయ్ దేవ్‌గణ్ రెస్పాండ్ అవ్వలేదు. రామ్‌చరణ్ బర్త్‌డేకు భీమ్ ఫర్ రామరాజు వీడియోను కాస్త ఆలస్యమైనా వదిలి ఫ్యాన్స్‌ను సంతోషంలో ముంచెత్తిన డైరెక్టర్ రాజమౌళి టీమ్.. అజయ్ దేవ్‌గణ్ బర్త్‌డేకి మాత్రం అలాంటి ట్రీట్ ఇవ్వడంలో విఫలమైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లనుంచే పనిచేస్తూ రామ్‌చరణ్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన 'రౌద్రం రణం రుధిరం' బృందం, అజయ్ దేవ్‌గణ్ పుట్టినరోజుకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా రాజమౌళి మీద అభిమానంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన అజయ్ విషయంలో చిత్ర బృందం అలసత్వం ప్రదర్శించిందని ఫిల్మ్‌నగర్ జనాలు కూడా అభిప్రాయపడుతున్నారు.