స్ట్రగుల్స్‌కు 'చెక్' చెప్పి.. 'రంగ్ దే' అంటున్న నితిన్!
on Nov 26, 2020
అతను ఎదుర్కొన్న స్ట్రగుల్స్ మరొకరికి ఎదురైతే ఎలా ఉండేదేమో కానీ, పట్టువదలని విక్రమార్కునిలా సుదీర్ఘ కాలం స్ట్రగుల్స్‌ను అధిగమించి 2012లో విజయాల బాట పట్టాడు నితిన్. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్‌లతో హ్యాట్రిక్ సాధించాడు. తొలి రెండు సినిమాలు 'జయం' (2002), 'దిల్' (2003), తర్వాత 2004లో రాజమౌళి సినిమా' సై' అతని ఇమేజ్‌ను మరింత పెంచింది.
కానీ ఆ తర్వాత ఏకంగా మరో హిట్ కోసం అతను ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో హిందీ డెబ్యూ మూవీ 'అగ్యాత్' సహా 12 సినిమాలు చేసినా, ఒక్కటీ ప్రేక్షకుల ఆదరణను పొందలేదు. 'ఇష్క్' నుంచి నితిన్ కెరీర్ గాడిలో పడింది. 2016లో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించిన 'అ ఆ' తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు రావడంతో నితిన్ మళ్లీ కష్టాల్లో పడుతున్నాడా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ, ఈ ఏడాది 'భీష్మ' మూవీతో మరో చక్కని విజయం అందుకున్నాడు.
ప్రస్తుతం అతను చేస్తున్న రెండు సినిమాలపైనా మంచి అంచనాలే ఉన్నాయి. అవి.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న 'రంగ్ దే' మూవీ ఒకటైతే, మరొకటి చంద్రశేఖర్ ఏలేటి రూపొందిస్తోన్న 'చెక్' సినిమా. ఈ రెండూ విజయం సాధిస్తాయనే గట్టి నమ్మకం నితిన్‌తో పాటు, అతని అభిమానుల్లోనూ గట్టిగా వ్యక్తమవుతోంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
