ఓ మై గాడ్: నిత్యా మీనన్ లిప్‌లాక్!
on Jul 15, 2020
సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడానికి ససేమిరా అనే స్టార్లు.. వెబ్ సిరీస్ అనేసరికి ఏ తరహా సీన్లకైనా రెడీ అవుతుండటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వాళ్లు అన్ని రకాల ప్రయోగాలూ చేస్తుంటారు. ఇంతకాలం ఒద్దికగా, పొందికగా వెండితెరపై కనిపిస్తూ వచ్చిన బొద్దుభామ నిత్యా మీనన్ ఓ వెబ్ సిరీస్ కోసం లిప్‌లాక్ సీన్ చేసింది. అదీ ఓ ఫిమేల్ యాక్టర్‌తో! జూలై 10న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయిన 'బ్రీత్ ఇన్టు ద షాడోస్' సిరీస్‌లో మెయిన్ రోల్ చేసిన అభిషేక్ బచ్చన్ భార్యగా నిత్య నటించింది. ఇందులో ఓ సన్నివేశంలో శ్రుతి బప్నా అనే అంతగా పేరులేని తారతో ఆమె ఈ లిప్‌కిస్ సీన్ చేసింది. తన ప్లాన్‌లో భాగంగా ఆమెను ట్రాప్ చేసి, ఆమె పెదాలకు తన పెదాలను ముడివేసి, ఆపై తన పని పూర్తి చేసుకొని వెళ్లే సీన్లో నిత్య జీవించిందని చెప్పాలి.
అయితే సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నడూ స్కిన్ షోకు కానీ, ఇంటిమేట్ సీన్లు చేయడానికి కానీ నిత్య ఒప్పుకోలేదు. తనతోటి తారలు ఆ తరహా సీన్లు చేసి, అంగాంగ ప్రదర్శనలు చేసి గ్లామరస్ హీరోయిన్స్‌గా అందలం ఎక్కుతున్నా నిత్య మాత్రం తన పంథా మార్చుకోలేదు. అందుకే నిత్య అంటే ప్రేక్షకుల్లో ఓ విధమైన గౌరవం ఉంది. ఇప్పుడు వాళ్లు 'బ్రీత్' సిరీస్‌లో నిత్య లిప్‌లాక్ సీన్ చూసి షాకవుతున్నారు. ఆమె నుంచి ఇలాంటి సీన్‌ను ఊహించలేదనీ, మరో లేడీ యాక్టర్‌ను ట్రాప్‌చేసి, ఆమెకు లిప్‌కిస్ ఇవ్వడం తమకు నిజంగా షాక్ కలిగించిందనీ వాళ్లంటున్నారు. ఓటీటీ కంటెంట్ అంటేనే ఈ తరహా సన్నివేశాలు ఉంటాయనీ, ఏ యాక్టరైనా వెబ్ సిరీస్‌లో ఈ తరహా సీన్లు చేయడానికి ముందుకు వస్తున్నారనీ, నిత్య అందుకు మినహాయింపు కాదనీ.. ఈ ప్లాట్‌ఫామ్ గురించి బాగా తెలిసినవాళ్లు అంటున్నారు. మొత్తానికి తన బోల్డ్ యాక్ట్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది నిత్య.