English | Telugu

నాగశౌర్యకు నితిన్ కౌంటర్ ఇచ్చేశాడుగా!

on Feb 25, 2020

 

'భీష్మ' మూవీ సక్సెస్ మీట్‌లో యంగ్ హీరో నాగశౌర్యకు గట్టి చురకవేశాడు నితిన్. ఫిబ్రవరి 21న విడుదలైన 'భీష్మ' మూవీ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తూ, విడుదలైన ఐదో రోజే బ్రేకీవెన్ సాధించేసింది. ఆ క్రిడిట్ అంతా డైరెక్టర్ వెంకీ కుడుములదేనంటూ అంతా ప్రశంసిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో జరిగిన సక్సెస్ మీట్‌లో మాట్లాడిన నితిన్, "నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్‌తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా" అని చెప్పాడు.

"ఈ హిట్‌తో చాలామందికి అతను జవాబు చెప్పాడు" అని నితిన్ చెప్పింది నాగశౌర్యను ఉద్దేశించేనని ఎవరైనా చెప్పేస్తారు. అంతేకాదు.. వెంకీ మాట్లాడుతున్న సమయంలో మధ్యలో వచ్చి "వెంకీ.. ఈ కథ నీదేకదూ" అని అడగటం కూడా శౌర్యను ఉద్దేశించే. డైరెక్టర్‌గా వెంకీ ఫస్ట్ ఫిల్మ్ 'ఛలో' అనీ, అందులో నాగశౌర్య హీరో అనీ మనకు తెలిసిందే. అయితే ఇటీవల 'ఛలో' సినిమా కథ తను ఇచ్చాననీ, కానీ ఆ విషయం వెంకీ చెప్పలేదనీ అంటూ అతనిపై నాగశౌర్య విమర్శలు గుప్పించడం వివాదానికి దారితీసింది. అయితే వెంకీ మాత్రం దానికి ప్రతిస్పందించకుండా మౌనం వహించాడు. 

'అశ్వథ్థామ' కథను కూడా నాగశౌర్య సమకూర్చిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అయితే.. కథ ఎవరు ఇచ్చినా, ఆ సినిమాను డైరెక్టర్ రూపొందించే తీరువల్లే దాని జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. 'భీష్మ' సినిమాతో వెంకీ సక్సెస్ సాధిస్తే, 'అశ్వథ్థామ'తో ఫ్లాప్ చూశాడు నాగశౌర్య. దాంతో శౌర్యపై వెంకీ పైచేయి సాధించినట్లయింది. ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు నితిన్ ఆ విషయాన్ని ఇన్‌డైరెక్టుగా ప్రస్తావిస్తూ వెంకీని పొగడటంతో ఆపకుండా నాగశౌర్యకు చురకలు వేసేట్లు మాట్లాడాడని ఫిలింనగర్ జనాలు చెప్పుకుంటున్నారు.


Cinema Galleries



Latest News


Video-Gossips