డైరెక్టర్ ని డమ్మీ చేసి ఆడుకున్న నిఖిల్
on Mar 9, 2018
కొందరు ఎదగడానికి టైం పడుతుంది, మరికొందరు ఓవర్ నైట్ లో స్టార్డమ్ అనుభవిస్తారు. యంగ్ హీరో నిఖిల్ మొదటి కోవలోకి వస్తాడు. మొదట్లో చిన్న, చిన్న సినిమాలు చేసిన నిఖిల్ కి హ్యాపీ డేస్ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత యువత తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మళ్ళీ, స్వామి రా రా తో ట్రాక్ లో పడ్డాడు. ఇక నిఖిల్ కి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిట్స్ మీద హిట్స్ కొడుతూ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం కిర్రాక్ పార్టీ రిలీజ్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం ఏంటంటే, నిఖిల్ డైరెక్టర్ శరన్ కొప్పిశెట్టి ని పూర్తిగా పక్కకు పెట్టి, తన క్లోజ్ ఫ్రెండ్ సుధీర్ వర్మ కి ఆ బాధ్యతలు అప్పగించాడట. మొదట, స్క్రీన్ ప్లే రాయడానికి అని పిలిపించుకొని, శరన్ వర్క్ స్టైల్ నచ్చక సుధీర్ తోనే మిగతా పనులు కూడా కానిచ్చాడట. ఫస్ట్ టైం డైరెక్షన్ ఛాన్స్, అందులోను నిఖిల్ హీరో అని సంబరపడ్డ శరన్ కి... నిఖిల్ ఈ విధంగా పెద్ద షాక్ ఇచ్చాడట. మార్చ్ 16 న విడుదలకి సిద్దమవుతున్న కిర్రాక్ పార్టీ కన్నడ హిట్ ఫిలిం కిరిక్ పార్టీ కి రీమేక్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. నిఖిల్ మరో ఫ్రెండ్ చందూ మొండేటి కిర్రాక్ పార్టీ కి డైలాగ్ లు సమకూర్చాడు. నిఖిల్ తనకు సూపర్ హిట్లిచ్చిన ఈ ఇద్దరు మిత్రుల్ని నమ్మినంతగా మరెవ్వరినీ నమ్మట్లేదని టాక్.