అన్నను రౌడీని చేసిన తమ్ముడు
on Sep 5, 2018
హ్యాపీడేస్‌తో సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించిన నిఖిల్ వరుస విజయాలను అందుకొన్నారు. హీరోగా రాణిస్తున్న నిఖిల్ ఇటీవల ఓ కాలేజీ వివాదంలో చిక్కుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వాటి గురించి మీడియాతో మాట్లాడుతూ ఆ కాలేజీ గొడవపై వివరణ ఇచ్చాడు నిఖిల్. తమ్ముడి కాలేజీలో జరిగిన గొడవపై ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. తన తమ్ముడ్ని కొంత మంది అకతాయలు కాలేజీలో ర్యాగింగ్ చేస్తూ... ప్రతీ రోజు వారి విన్యాసాల కోసం తన తమ్ముడితో అనేక రకాలైన పనులు చేయించడమే కాకుండా రోజు తనను కొడుతున్నారు. నేను వారికి బుద్ది చెప్పటానికి కాలేజీకి వెళ్ళిన మాట వాస్తవమే కానీ నేను ఎవరినీ కొట్టలేను... నేను చెప్పే మాటలు స్టూడెంట్స్ వినకపోయే సరికి నా తమ్ముడితో కలిసి పోలీసులకు పిర్యాదు చేశాను. పోలీసుల సహాయంతోనే నా తమ్ముడి సమస్యను పరిష్కరించాం. నేను మాత్రం వ్యక్తిగతంగా ఎవరిపైనా దాడి చేయలేదు. ఈ కాలేజీ గొడవలో కొంతమంది నేను కాలేజీకి వెళ్లి రౌడీలా స్టూడెంట్స్‌ని బెదిరించాను అంటూ నాకు రౌడీ అనే ముద్రను అంటించారు. నన్ను రౌడీ అంటే మాత్రం నేను ఒప్పుకోను అంటూ మీడియాకు జరిగిన అసలు విషయం వివరించాడు నిఖిల్. అదీ అసలు సంగతి.