మెగా డాటర్తో సుక్కు సినిమా !!!
on Feb 16, 2019
`రంగస్థలం` తో ఇండస్ట్రీ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం మహేష్ బాబు 26 వ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నాడట. ఒకవైపు ఇది చేసుకుంటూనే మరో వైపు సహా నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం అటివలే లాంచ్ అయ్యింది. ఈ చిత్రంతో సుక్కు శిష్యుడు బుచ్చిబాబు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యాడు సుక్కు. అయితే ఈసారి మెగా డాటర్ నిహారిక కోసం కథను సిద్దం చేశాడట. ఆయన శిష్యుడ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ తో కానీ లేక అంజనా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని వివరాలు వెలుబడునున్నాయి.