మెగా డాటర్ మూవీ ఫినీష్!!
on Jan 11, 2019
మెగా బ్రదర్ నాగేంద్రబాబు తనయ నిహారిక కొణిదెల ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ లో నటించి, ఒక మనసు మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. తర్వాత నాన్న కూచి వెబ్ సిరీస్ లో నటించి నిర్మించారు. తమిళ భాషలో కూడా ఒక మూవీ లో నటించారు. ఇప్పుడు సూర్యకాంతం మూవీలో డిఫరెంట్ షెడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. నాన్న కూచి వెబ్ సిరీస్ దర్శకుడు ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వంలో రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంట గా సూర్యకాంతం మూవీ రూపొందుతుంది. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై రూపొందిన సూర్యకాంతం మూవీ నిర్మాత సందీప్ యెర్రంరెడ్డి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమర్పణలో రూపొందిన సూర్యకాంతం మూవీకి రాబిన్ మార్క్ సంగీతం అందించారు. నిహారిక బర్త్ డే సందర్భంగా సూర్యకాంతం మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సూర్యకాంతం మూవీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ కానుంది.