మోడ్రన్ సూర్యకాంతం!!
on Mar 27, 2019
సూర్యకాంతం అనగానే మనకు గుర్తొచ్చేది ఊరకనై నోరేసుకుని పడిపోయే గయ్యాళి అని. మరి పాత సినిమాల్లో గయ్యాళి అత్తగా, గయ్యాళి భార్యగా, గయ్యాళి పాత్రల్లో నటించి సూర్యకాంతం పేరంటేనే భయపడేలా చేసింది. ఎవరైనా కొంచెం గడసరిగా, గయ్యాళిగా అనిపిస్తే వారికి సూర్యకాంతం అని పేరు పెట్టేస్తుంటారు. ఇక ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా సూర్యకాంతం అవతరాం ఎత్తింది. నిహారికి నటిస్తోన్న `సూర్యకాంతం` ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ట్రైలర్ లో మిడిల్ ఫింగర్ చూపించి అందర్నీ షాక్ కి గురి చేసింది నిహారిక.
పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో నిహారిక క్యారక్టర్ టైటిల్ తగ్గట్టుగా చాలా రఫ్ గా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ చివరిలో మిగిల్ ఫింగర్ చూపించడంతో మళ్లీ మళ్లీ రిపీట్ చేసి చూస్తున్నారు యూత్. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇక సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. నిహారిక సూర్యకాంతంగా మెప్పిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు సినీ జనాలు. ఈ సినిమా ఈ నెల 29 న గ్రాండ్ గా విడుదల కానుంది. చూద్దాం మెగా డాటర్ ఈ సారైనా మాయ చేస్తుందో లేదో మరి.