మెగా డాటర్ లో అంత మ్యాటర్ ఉందంటారా!!
on Sep 14, 2018
అవును సైరాలో మెగా డాటర్ ఓ క్యారక్టర్ చేయనుందని ఓ ఇంటర్వ్యూ లో స్వయంగా నిహారిక ప్రకటించింది. అయితే ఆమె క్యారక్టర్ గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తోంది. తాజా వార్తల ప్రకారం నిహారిక `సైరా నరసింహారెడ్డి` లో పది నిమిషాల నిడివి గల పాత్రలో నటిస్తోందట. ఒక కథాకళి డాన్సర్ గా ఆమె కనువిందు చేయనుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం నిహారికి కథాకళి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వలరో నిహారిక సైరా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలున్నట్లు వినికిడి. పది నిమిషాల పాత్ర అయినప్పటికీ స్టోరీతో ఆమె క్యారక్టర్ లింకయ్యి ఉంటుందట. డాన్స్ ర్ గా , పర్ఫార్మెన్స్ పరంగా ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర, పైగా పెదనాన్నతో కలిసి తొలి సారిగా నటిస్తోంది కాబట్టి చాలా కేర్ తీసుకుంటుందట నిహారిక. అయితే నిహారిక ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది లేదు. ఆమె కథాకళి ఇప్పటికిప్పుడు నేర్చుకుని ఆ పాత్ర కు న్యాయం చేయగలదా? ఆమె లో అంత మ్యాటర్ ఉందా? అంటున్నారు సినీ జనాలు. చూద్దాం నిహారిక ఈ అవకాశాన్ని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందో!!