ఫొటో టాక్: మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం
on Aug 13, 2020
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం గురువారం సాయంత్రం వారి స్వగృహంలో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా నిశ్చితార్థ వేడుకకు విచ్చేసి తమ్ముడి కూతుర్ని, ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడు చైతన్యను ఆశీర్వదించారు. ఈ శుభ కార్యానికి కొణిదెల కుటుంబ సభ్యులు, అటు అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని వినికిడి. తక్కువ మందిని ఆహ్వానించారట.
మెగా కుటుంబానికి ఎప్పటినుంచో స్నేహసంబంధాలు ఉన్న గుంటూరుకు చెందిన పోలీస్ అధికారి కుమారుడే చైతన్య. ఆల్రెడీ నిహారికతో అతడు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read