మెగా హీరో వంట తిని చెల్లెలు ఏమన్నారంటే?
on Sep 24, 2020
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు, యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ఈరోజు వంట చేశారు. "ఫైనల్లీ... ఈ రోజు వంట చేయడం ప్రయత్నించా" అని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన వంటను చెల్లెలు నిహారికాకు తినిపించారు.
నిహారిక తింటున్నప్పుడు "ఎలా ఉందో చెప్పు?" అని వరుణ్ తేజ అడిగారు. "నైస్" అని నిహారిక సమాధానమిచ్చారు. ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. పెళ్ళికి ముందు చెల్లికి సరదాగా వరుణ్ తేజ్ వంట చేసి పెట్టారేమో!
సినిమాల విషయానికి వస్తే... బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ మొదటి వారంలో ఆ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కరోనాకి ముందు ఒక పదిహేను రోజులు విశాఖపట్టణంలో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఆ తర్వాత అనుకోకుండా కరోనా వల్ల అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణ పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మార్చి వరకు షూటింగ్ జరుగుతుందట.