నైట్ షూట్స్ లో బాలయ్య
on Nov 30, 2020
నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ మధ్య నైట్ షూట్స్ లో బిజీగా ఉన్నారు. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ వెంచర్ కోసమే ఇదంతా. ఆ వివరాల్లోకి వెళితే.. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత బాలయ్య, బోయపాటి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
తాజా షెడ్యూల్ లో హాస్పిటల్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. బాలకృష్ణ, పూర్ణతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా రాత్రివేళలో ఈ కీలక దృశ్యాలను పిక్చరైజ్ చేస్తున్నారట. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ లో వచ్చే సీన్స్.. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
BB3 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి యువ సంగీత సంచలనం తమన్ బాణీలను అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.