పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ?
on Nov 22, 2020
'సవ్యసాచి' (2018)తో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది నిధి అగర్వాల్. ఆపై 'మిస్టర్ మజ్ను'(2019)తో సందడి చేసింది. అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ కాంబినేషన్స్‌లో చేసిన ఈ సినిమాలు నిధిని నిరాశపరిచాయి. అయితే అనూహ్యంగా 'ఇస్మార్ట్ శంకర్' (2019) బ్లాక్ బస్టర్ కావడంతో నిధికి అవకాశాల నిధి దొరికినట్లయ్యింది. ఈ ముద్దుగుమ్మ నటించిన తమిళ చిత్రం 'భూమి' (ఇందులో జయం రవి హీరో) విడుదలకు సిద్ధమవగా.. మరో కోలీవుడ్ ప్రాజెక్ట్ 'ఈశ్వరన్' (ఇందులో శింబు కథానాయకుడు) నిర్మాణ దశలో ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న చిత్రంలోనూ నిధినే నాయిక.
ఇదిలా ఉంటే.. నిధి ఖాతాలో కెరీర్ బెస్ట్ ఆఫర్ చేరిందని టాలీవుడ్ టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఓ పిరియడ్ డ్రామా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ నాయికగా శ్రీలంక సుందరి జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. మరో హీరోయిన్‌గా నిధి ఎంపికైందని వినికిడి. అదే గనుక నిజమైతే.. నిధి కెరీర్ సరికొత్త మలుపు తిరిగినట్టే. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నిధి చేరికపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
