శ్రియ సవాల్.. వంట పాత్రలు శుభ్రం చేస్తావా బన్నీ?
on Apr 4, 2020
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న 21 రోజుల లాక్డౌన్ నేపథ్యంలో బయటకు వెళ్లి ఏమీ చేయలేని పరిస్థితుల్లో సినిమా సెలబ్రిటీలు తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ కుటుంబంతో గడుపుతున్నారు. ఈ సందర్భంలో కొత్త కొత్త పనులు నేర్చుకుంటున్నారు. తమలో దాగివున్న కొత్త స్కిల్స్‌ను వెలికి తీస్తున్నారు. సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్‌తో ఫ్యాన్స్‌తో సంభాషిస్తున్నారు. మగవాళ్లయితే తమ భార్యలకు వంటపనుల్లో సాయం చేస్తున్నారు. 2.5 మిలియన్ ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే సీనియర్ హీరోయిన్ శ్రియ శుక్రవారం ఒక కొత్త టాస్క్‌తో ముందుకు వచ్చింది.. దాని పేరు 'బర్తన్ సాఫ్ కరో చాలెంజ్'.. అంటే 'వంటపాత్రల్ని శుభ్రం చేయండి చాలెంజ్' అన్నమాట. ఈ టాస్క్‌కు ఆమె ఎవర్ని నామినేట్ చేసిందో తెలుసా? మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను. అతనితో పాటు తమిళ నటుడు ఆర్య సహా మొత్తం డజను మందిని శ్రియ నామినేట్ చేసింది.
ఈ టాస్క్ ఇస్తూ ఆమె ఒక వీడియో షేర్ చేసింది. అందులో వంటగదిలో ఆమె భర్త ఆండ్రీ కొశ్చీవ్ సింక్‌లో పాత్రల్ని శుభ్రం చేస్తూ కనిపిస్తున్నాడు. "నా భర్తను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? ఎందుకంటే వంటకాలు చేయడాన్ని నేను ద్వేషిస్తాను. కాబట్టి ఈ కఠిన కాలంలో తమ అందమైన భార్యలకు ఎలా సాయం చేస్తున్నారో వివాహితులైన మగవాళ్లందరినీ సవాలు చేద్దాం. కొంతమంది నా మిత్రులను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నా, మీరు కూడా మీ భర్త పనిచేస్తున్న వీడియోలను పోస్ట్ చేయండి" అంటూ ఆ వీడియోలో చెప్పకొచ్చింది. మధ్యలో దీక్షగా పాత్రల్ని కడుగుతున్న భర్త దగ్గరకు వెళ్లి లిప్ కిస్ కూడా ఇచ్చింది. మరి ఈ చాలెంజ్‌కు శ్రియ ఫ్రెండ్ అయిన బన్నీ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.