కరోనా కంటే ముందే వర్మ ‘వైరస్’
on Apr 3, 2020
పదేళ్ల క్రితమే కరోనా వంటి వైరస్ వస్తే ప్రపంచం ఎలా ఉంటుందనే కథను రామ్‌గోపాల్ వర్మ తనకు చెప్పారని రీసెంట్ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ చెప్పారు. పూరికి పదేళ్ల కిందట కథ చెప్పారేమో! కానీ, 2018లో ‘వైరస్’ అని వర్మ ఒక సినిమా ప్రకటించారు. ‘సర్కార్’ సినిమా నిర్మించిన పరాగ్ సంఘీ ఆ సినిమా నిర్మిస్తారని తెలిపారు. ప్రకటలనకు మాత్రమే పరిమితమై, సెట్స్‌కి వెళ్లని వర్మ సినిమాల జాబితాలో ‘వైరస్’ కూడా చేరింది. ప్రేక్షకులతో పాటు పరిశ్రమ కూడా ఆ సినిమా సంగతి మరచింది.
మళ్లీ ఇన్నాళ్లకు, అప్పట్లో ఆ సినిమా గురించి వేసిన ట్వీట్‌ను వర్మ బయటకు తీశారు. ‘‘భయంకరమైన వైరస్ మీద నేనొక స్ర్కిప్ట్ రాశా. 10/6/2018న సినిమా తీయాలని చెప్పా. నా ఇంటెన్షన్ ఏంటో కూడా వివరించా. రెండేళ్ల తర్వాత ఆ ట్వీట్ చూస్తే... ప్రస్తుత పరిస్థితులకు చాలా సారూప్యతలు కనిపిస్తున్నాయి’’ అని రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. బహుశా... ఇప్పుడు ఆ సినిమా తెరకెక్కిస్తారేమో? కరోనా ప్రపంచవ్యాప్తంగా కంగారు పుట్టిస్తున్న సమయంలోఆర్జీవీ పాత కథకు దుమ్ము దులిపి, కొత్త హంగులు అద్దినా ఆశ్చర్యపోనవసరం లేదు.