ఎప్పుడూ విరాట్ కోహ్లీ రూమ్‌లో లేను!
on Apr 2, 2020
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'పంజా' మూవీ గుర్తుందా? మరి, అందులో హీరోయిన్గా నటించిన సారా జేన్ డయాస్ గుర్తుందా? తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. కానీ, హిందీలో చేశారు. తొమ్మిది, పదేళ్ల క్రితం మాట... వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే గుసగుస గట్టిగా వినిపించింది. కట్ చేస్తే... అనుష్కాశర్మను విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
సారా జేన్ డయాస్ విషయానికి వస్తే... ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. విరాట్ కోహ్లీతో డేటింగ్ అనే టాపిక్ ఆమెను ఇంకా వదిలిపెట్టలేదు. ఇప్పటికీ ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. 'నన్ను ఓ ప్రశ్న అడగండి' అని గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో సారా పోస్ట్ చేశారు. 'ఒకానొక టైమ్‌లో మీరు, విరాట్ కోహ్లీ డేటింగ్ చేసుకున్నారనేది నిజమేనా?' అని ఒక నెటిజన్ అడిగారు. అందుకు సారా జేన్ డయాస్ ఏం చెప్పిందో తెలుసా? "నో. మిస్టర్ కోహ్లీ, నేను ఎప్పుడూ డేటింగ్లో లేము. యాక్చువల్లీ... ఎప్పుడూ అతడు ఉన్న రూమ్‌లో కూడా లేను" అని. ఇప్పటికైనా విరాట్ కోహ్లీతో సారా జేన్ డయాస్ డేటింగ్ రూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.