ఒకవేళ హీరోయిన్ కాకపోతే?
on Apr 2, 2020
"ఒకవేళ మీరు సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేవారు?" ప్రతి సెలబ్రిటీకి ఈ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట తప్పకుండా ఎదురవుతూ ఉంటుంది. చాలామంది సినిమాలే తమ జీవితం అనుకున్నామనీ, మరో కెరీర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెబుతూ ఉంటారు. అతి కొద్ది మంది నిజాయితీగా ఏం అవ్వాలనుకున్నామో చెబుతారు. పూజా హెగ్డే కూడా అలాగే చెప్పారు. ఒకవేళ హీరోయిన్ కాకపోతే... తాను స్టైలిస్ట్ లేదా ఫోటోగ్రాఫర్ అయ్యేదాన్ని అని ఆమె చెప్పారు. కథానాయికగా తనకు ఇంత గుర్తింపు పేరు తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకులకు తన జీవితం అంకితం అని పూజా హెగ్డే అన్నారు.
ప్రస్తుతం కరోనా, లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉంటున్న ఈ స్టార్ హీరోయిన్, ఖాళీ సమయంలో గిటార్ నేర్చుకుంటున్నారు. ఎక్కువ సమయం తినడం, నిద్రపోవడం, సినిమాలో వెబ్ సిరీస్ లో చూడడం... మళ్లీ అవే పనులు చేయడం చేస్తున్నానని పూజా హెగ్డే చెప్పారు.
Also Read