స్టన్నింగ్ సమ్మర్ బ్యూటీ!
on Mar 30, 2020
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఒక స్టన్నింగ్ ఫొటోగ్రాఫ్‌తో తన అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో రెండు ఫొటోలను ఆమె షేర్ చేసింది. ఒక ఫొటోలో పూల డిజైనింగ్ ఉన్న సమ్మర్ డ్రస్‌లో ఆమె ఇచ్చిన ఫొటోను ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తున్నారు. ఇంకొకటి.. వెనుక సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా తీసిన సెల్ఫీ. వాటికి ఆమె రెండు ఫ్లవర్ ఎమోజీలను క్యాప్షన్‌గా ఉంచింది.
టైగర్ ష్రాఫ్ గాళ్ ఫ్రెండ్‌గా పేరుపొందిన దిశ 'బాఘీ 2'లో హీరోయిన్గా ఆకట్టుకుంది. సల్మాన్ ఖాతో 'భారత్' మూవీలో ఒక నాయికగా నటించిన ఆమె, త్వరలో విడుదల కానున్న 'రాధే' సినిమాలోనూ సల్మాన్ జోడీగా అలరించనుంది. అయితే ఆమె హీరోయిన్గా పరిచయమైంది మాత్రం తెలుగు సినిమాతోటే. అది వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్' మూవీ.
Also Read