ఆయన నాకు నిజంగా స్పెషల్ పర్సన్!
on Mar 30, 2020
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి, అక్కడ అనుకున్న దానికి మించి రాణిస్తోన్న పొడుగుకాళ్ల సుందరి తాప్సీ ఉత్తమ నటిగా జీ సినీ అవార్డ్‌ను గెలుచుకుంది. మర్డర్ థ్రిల్లర్ 'బద్లా'లో పోషించిన నెగటివ్ రోల్‌కు గాను ఆమెకు ఈ అవార్డ్ రావడం గమనార్హం. సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ రెండోసారి కలిసి నటించారు. స్పానిష్ ఫిల్మ్ 'ది ఇన్విజిబుల్ గెస్ట్' (2016)కు 'బద్లా' అఫిషియల్ రీమేక్. ఒక లాయర్, ఒక బిజినెస్వుమన్ మధ్య సంభాషణతో మొదలయ్యే ఈ సినిమాలో, తన లవర్ మర్డర్ కేస్‌లో తనను తప్పుగా ఇరికించారని లాయర్‌కు ఆమె చెప్పడం, దానిపై కథ నడవడం మనం చూస్తాం.
బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డ్ అందుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన తాప్సీ, "విలన్‌గా ఒక పెద్ద హీరోను తీసుకొనే అవకాశం వదులుకొని, ఆ క్యారెక్టర్లో ఒక లేడీ యాక్టర్‌ను తీసుకొని ధైర్యంగా సినిమా నిర్మించిన నిర్మాత సునీల్ ఖేతర్పాల్కు థాంక్స్ చెప్పుకోవాలి. రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్‌కు భిన్నమైన ఒక విలక్షణ మూవీని పర్ఫెక్టుగా రిలీజ్ చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన షారుక్‌ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్కు థాంక్స్.. తెర పంచుకున్న ప్రతిసారీ, నాలోని నటిని వెలికి తీస్తూ వచ్చిన అత్యంత ఉత్తమ సహ నటులు అమితాబ్ బచ్చన్ నాకు, నా కెరీర్‌కు నిజంగా స్పెషల్ పర్సన్. ఇక నన్ను నైనా సేథిగా తెరపై గొప్పగా ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ సుజోయ్ ఘోష్ ను ఏమని ప్రశంసించను!" అని పోస్ట్ చేసింది.