తారక్ వాయిస్ అదరహో అంటున్న నెటిజన్లు!
on Mar 28, 2020
'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్) మూవీలో రామ్‌చరణ్ పోషిస్తోన్న అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ టీజర్ మనముందుకు వచ్చి అలరించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో విడుదలై అన్ని భాషల ప్రేక్షకులనూ మెప్పిస్తోంది. ప్రధానంగా తెలుగు, హిందీ భాషల టీజర్ బ్లాక్‌బస్టర్ అయ్యిందని వ్యూస్ చెబుతున్నాయి. హిందీలో అజయ్ దేవ్‌గణ్ సొంత చానల్ అజయ్ దేవ్‌గణ్ ఫిలిమ్స్ ద్వారా విడుదలై ట్రెండింగ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంది ఈ టీజర్.
గమనించదగ్గ విషయమేమంటే ఒక్క మలయాళం తప్ప మిగతా నాలుగు భాషల్లోనూ భీమ్ పాత్రధారిగా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ఈ టీజర్‌ను రోమాలు నిక్కబొడిచేలా చేస్తోందని నెటిజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు. రామరాజు పాత్రను పరిచయం చేస్తూ భీమ్ (తారక్) చెప్పే ఒక్కొక్క మాటా ఒక్కొక్క తూటాలా పేలిందని వాళ్లు అంటున్నారు. భీమ్ ఫర్ రామరాజు సర్ప్రైజ్ వీడియో ఇంత వైరల్ అవడానికి, తెలుగు వీడియో ఇప్పటికే 7 మిలియన్ వ్యూస్, హిందీ వెర్షన్ వీడియో 5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడానికీ తారక్ వాయిస్ బాగా ఉపయోగపడిందని అందరూ అంగీకరిస్తున్నారు. ఇక 'రామరాజు ఫర్ భీమ్' వీడియో కోసం మే 20 దాకా మనం ఆగాలి. అందులో భీమ్‌ను రామరాజు ఎలా పరిచయం చేస్తాడో, చరణ్ వాయిస్ ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగు వెర్షన్‌కు బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తుండగా, తమిళ వెర్షన్‌కు మదన్ కర్కీ, హిందీ వెర్షన్‌కు రియా ముఖర్జీ, కన్నడ వెర్షన్‌కు వరదరాజు, మలయాళ వెర్షన్‌కు మంకొంబు గోపాలకృష్ణన్ రాస్తున్నారు. ఇప్పటికే తమిళ వెర్షన్‌కు సంబంధించి ఇప్పటివరకూ ఎడిట్ చేసిన సన్నివేశాలకు తారక్ డబ్బింగ్ చెప్పినట్లు మదన్ కర్కీ తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తెలిపాడు.