ENGLISH | TELUGU  

పవన్‌కల్యాణ్‌కు చెప్పకుండా ప్రకటించారా?

on Nov 20, 2019

తెలుగులో పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌ ఏంటనేది ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. పవర్‌ స్టార్‌కు యంగ్‌ స్టార్‌ హీరోల్లో చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అటువంటి హీరో కొంత విరామం తర్వాత, రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి వస్తున్న వార్తను ఎక్కడో ముంబైలో ఉన్న ఓ క్రిటిక్‌ ట్వీట్‌ చేయడం ఏంటనేది చాలామందికి అర్థం కాలేదు. ‘దిల్‌’ రాజు, బోనీ కపూర్‌ నిర్మాణంలో పవన్‌కల్యాణ్‌ తెలుగులో ‘పింక్‌’ రీమేక్‌ చేస్తారని హిందీ క్రిటిక్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశాడు. దాన్ని బోనీ కపూర్‌ రీట్వీట్‌ చేశారు.

కానీ, ‘దిల్‌’ రాజు నిర్మాణ సంస్థ గానీ... ఆ సంస్థకు చెందిన కీలక వ్యక్తులు గానీ రీట్వీట్‌ చేయలేదు. కారణాలు ఏంటని ఆరా తీస్తే... పవన్‌కల్యాణ్‌కు చెప్పకుండా, ఆయన నుండి పూర్తిగా హామీ తీసుకోకుండా బోనీ కపూర్‌ హిందీ ఇండస్ట్రీలో ‘పింక్‌’ రీమేక్‌ గురించి ప్రకటించుకున్నారట! కనీసం ‘దిల్‌’ రాజుకు కూడా ‘పింక్‌’ రీమేక్‌ ప్రకటన గురించి తెలియదట! తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌, బోనీ కపూర్‌ రీట్వీట్‌తో పవర్‌స్టార్‌ దగ్గర వ్యక్తులు, ‘దిల్‌’ రాజు కాంపౌండ్‌ షాకయ్యారట! పవన్‌ కల్యాణ్‌ మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆయన సెట్‌కి వచ్చేవరకూ నమ్మలేని పరిస్థితి. మైత్రీ మూవీ మేకర్స్‌లో ఓ రీమేక్‌ స్ర్కిప్ట్‌ మొత్తం పూర్తయిన తర్వాత చేయనని చెప్పిన ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కథలు వింటున్నా ఏది ముందు చేయాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.