మేనల్లుడి ఓపెనింగ్‌కి మహేష్ అందుకే రాలేదు!
on Nov 11, 2019
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఓపెనింగ్ ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. రామానాయుడు స్టూడియోను ఓపెనింగ్ కోసం బాగా ముస్తాబు చేశారు. ప్రొగ్రామ్ లైవ్ ఇచ్చారు. ఇంచుమించు ఆదివారం పాతిక లక్షలు ఖర్చు చేశారని టాక్. మనవడిని ఆశీర్వదించడానికి కృష్ణ వచ్చారు. మెగా ఫ్యామిలీ నుండి రామ్‌చరణ్, దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా, అక్కినేని ఫ్యామిలీ నుండి అమల, సుశాంత్, కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. అశోక్ తండ్రి గల్లా జయదేశ్ రాజకీయ సహచరులు, తెలుగుదేశం నేతలు వచ్చారు. ఎంతమంది వచ్చినా అక్కడ మహేష్‌బాబు లేనిలోటు కొట్టొచ్చినట్టు కనపడింది. కొందరు అభిమానుల్లో డిస్కషన్ పాయింట్ కూడా అయ్యింది.
మేనల్లుడు అశోక్‌కి విషెస్ చెప్తూ, ఆదివారం ఉదయం మహేష్‌బాబు ట్వీట్ చేశాడు. ఓపెనింగ్‌కి అర్థాంగి నమ్రతను పంపాడు. మరి, అతడు ఎందుకు రాలేదు? అంటే... తను ఓపెనింగ్‌కి వస్తే సినిమా హిట్ కాదని మహేష్ సెంటిమెంట్. సొంత సినిమా ఓపెనింగ్స్‌లో మహేష్ కనిపించడు. అందుకని, మేనల్లుడి సినిమా ఓపెనింగ్‌కి రాలేదని ఘట్టమనేని ఫ్యామిలీ ఇన్సైడ్ టాక్. షూటింగ్‌కి ఒకట్రెండు సార్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అటెండ్ అవ్వడం ఖాయమట! మేనల్లుడికి మహేష్ నుండి ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలిసింది.