English | Telugu

ప్రేమికులకు సూర్య సలహా...

on Sep 14, 2019

ప్రేమికులకు, ముఖ్యంగా అబ్బాయిలకు సూర్య ఒక సలహా ఇచ్చారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆమెను ఎలా ఒప్పించాలి? అని తీవ్రంగా ఆలోచిస్తున్న అబ్బాయిలకు ఈ సలహా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే... నేరుగా అమ్మాయి తల్లి దగ్గరకు వెళ్లి, నిజాయతీగా వాళ్ల అమ్మాయిని ఎంతగా ప్రేమిస్తున్నామన్నది చెప్పడమే. కాబోయే అత్తగారి దగ్గర ప్రేమ కహాని గురించి క్లారిటీగా చెప్పడమే. తమిళ హీరో ఆర్య అలాగే చేశాడని శుక్రవారం రాత్రి నిర్వహించిన 'బందోబస్త్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య అన్నారు.

తెలుగులో హీరోగా అఖిల్ అక్కినేని తొలి సినిమా 'అఖిల్'లో నటించిన సాయేషాను ఆర్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులు ఇద్దరూ 'బందోబస్త్'లో నటించారు. అయితే... ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. సూర్యకు జంటగా సాయేషా నటించగా... కీలక పాత్రలో ఆర్య నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయానికి  ఆర్య, సాయేషా ప్రేమలో పడ్డారు. అంతకు ముందు వీరిద్దరూ 'భలే భలే మగాడివోయ్' తమిళ్ రీమేక్ 'గజినీకాంత్'లో జంటగా నటించారు. 'బందోబస్త్'లో ఆర్య ముందు సాయేషాతో లవ్ సీన్స్ చేయడానికి ఇబ్బంది పడ్డానని సూర్య తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదల అవుతోంది.

 


Cinema GalleriesLatest News


Video-Gossips