రాశి 'ఫ్యాన్ గాళ్' మూమెంట్!
on Aug 24, 2019
నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య తెరపై అవే తరహా పాత్రలు చేస్తోన్న చిత్రం 'వెంకీ మామ'. ఆ ఇద్దరు కలిసి నటిస్తోన్న తొలి చిత్రం కూడా ఇదే. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తొన్న ఈ మూవీని సురేశ్ ప్రొడక్షన్స్ బేనర్‌పై డి. సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలొ వెంకీ జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీ ఖన్నా నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా వల్ల వెంకటేశ్‌కి రాశీ పెద్ద అభిమాని అనే విషయం తెలిసింది. ఆ సినిమా సెట్స్‌పై వెంకీని కావలించుకొని ఫొటో దిగిన రాశి, దాన్ని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసి, 'ఫ్యాన్ గాళ్' అంటూ క్యాప్షన్ జోడించింది. స్టార్ హీరోల్లో చాలా నిరాడంబరంగా కనిపించే వెంకీకి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమా సెట్స్‌పై సరదాగా గడిపే ఆయన, సహనటులతో పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. వాటిలో ఆధ్యాత్మిక అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయనతో ఒక అర గంట మాట్లాడితే చాలు.. చాలా విషయాలు తెలుస్తాయని అందరూ చెప్పే మాట. బహుశా రాశికి కూడా వెంకీ అట్లాంటి విషయాలేవో చెప్పి ఉంటారు. ఆ ఆనందాన్ని ఇలా ఫోటో తీయించుకోవడం ద్వారా వ్యక్తీకరించి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రాశి. ఈ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
ఆర్మీ నేపథ్యంలో నడిచే కథతో తయారవుతున్న 'వెంకీ మామ'ను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read