'బ్యాడ్ బాయ్' సాంగ్‌కు జాక్వలిన్ చార్జీ ఎంత?
on Aug 23, 2019
'సాహో' ప్రమోషన్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన 'బ్యాడ్ బాయ్' వీడియో సాంగ్ ఆన్లైన్లో హాట్ హాట్ ఐటంగా మారింది. ఆ పాటలో జాక్వలిన్ మూమెంట్స్, ప్రభాస్ - జాక్వలిన్ మధ్య కెమిస్ట్రీ వీక్షకుల్ని బాగా అలరించాయి. ఈ పాటలో డాన్స్ చెయ్యడానికి జాక్వలిన్ ఎంత రెమ్యూనరేషన్ వసూలు చేసిందనేది హాట్ టాపిక్‌గా మారింది. అందిన సమాచారం ప్రకారం 'బ్యాడ్ బాయ్'లో నర్తించడానికి ఆమె అందుకున్న మొత్తం అక్షరాలా రూ. 2 కోట్లు! బాలీవుడ్లో హీరోయిన్గా జాక్వలిన్‌కు మంచి డిమాండే ఉంది. ఒకవైపు టాప్ స్టార్స్, మరోవైపు మీడియం స్టార్స్‌తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఆమె 'సాహో'లో స్పెషల్ సాంగ్ చెయ్యడానికి కారణం హీరో ప్రభాస్!
శ్రీజో రాసిన ఈ పాటకు బాద్షా స్వారాలు కూర్చాడు. నీతి మోహన్, బాద్షా పాడారు. ఈ పాటలో జాక్వలిన్ అందాలు ఆరబోస్తూ, సెక్సీగా డాన్స్ మూమెంట్స్ ఇస్తే, అల్ట్రా మోదరన్ లుక్‌లో ప్రభాస్ ఆకట్టుకున్నాడు. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో శ్రద్ధ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఆగస్ట్ 30న బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే లక్ష్యంగా 'సాహో' విడుదలవుతోంది.