English | Telugu

'ఫైటర్'గా విజయ్ దేవరకొండ

on Aug 22, 2019

 

'ఇస్మార్ట్ శంకర్' సూపర్ సక్సెస్‌తో యమ ఖుషీగా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్, తన తర్వాతి సినిమా ప్రి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటించనున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ మూవీకి 'ఫైటర్' అనే టైటిల్ ఖరారు చేశారు. పూరి కనెక్ట్స్ బేనర్‌పై ఆ టైటిల్‌ను ఫిల్మ్ చాంబర్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేశారు. ఆ టైటిల్ విజయ్ దేవరకొండతో చేసే సినిమా కోసమే అని పూరి సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. ఆ టైటిల్‌ని బట్టి విజయ్ కేరెక్టర్ ఎలా ఉండబోతోందో, అతడ్ని పూరి ఎలా చూపించబోతున్నాడో అర్థమవుతోంది.

కాగా కేరెక్టర్‌కు తగ్గట్లు విజయ్ తన బాడీని మార్చుకోకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే వర్కౌట్స్, డైట్ ఫాలో చేసి, శరీరాన్ని దృఢంగా మార్చుకోనున్నాడు. ఇప్పుడైతే విజయ్ సన్నగా కనిపిస్తున్నాడు. 'ఫైటర్' రోల్‌కు కండలు తిరిగిన శరీరం కావాలి కాబట్టి దానికోసం డిసెంబర్ వరకు టైం తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే 2020 జనవరిలో పూరి, విజయ్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. విజయ్ సరసన హీరోయిన్ కోసం పూరి, నిర్మాత ఛార్మి అన్వేషిస్తున్నారు. విజయ్‌తో కొత్త కాంబినేషన్‌ను చూపించాలని వాళ్లనుకుంటున్నారు.
 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here