వెబ్ సిరీస్ చేస్తోన్న సమంత
on Aug 16, 2019
ఇటీవల `ఓ బేబీ` సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అక్కినేని కోడలు సమంత మరో కొత్త డెసిసిన్ తీసుకుందట. అవును నాగ చైతన్య తో పెళ్లయ్యాక డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వస్తోంది సమంత. యూ టర్న్, `ఓ బేబీ ` చిత్రాలు అందుకు నిదర్శనం. ఇక తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం `వెబ్ సిరీస్ లోనటిస్తోందట సమంత. ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ కు సంబంధిచిన షూటింగ్ చెన్నై లో శరవేగంగా జరుగుతోందట. అయితే ఈ వెబ్ సిరీస్ ఏకకాలంలో తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో తెరకెక్కుతున్నట్లు వినికిడి. ఇక ఈ న్యూస్ పై సమంత ఇంతవరకు స్పందించలేదు. సమంత ప్రస్తుతం శర్వానంద్ సరసన 96 తెలుగు రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసందే. సమంత వెబ్ సిరీస్ లో బిజి గా ఉండటంతో ఆ సినిమాకు కొంత బ్రేక్ వచ్చింది.