ఎన్టీఆర్కు హీరోయిన్ దొరకినట్టే!!
on Jul 23, 2019
ఏస్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో రామ్ చరణ్ కు జంటగా బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన మొదట హాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. కానీ, ఆమె కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో చాలా మంది ఇంగ్లీష్ బ్యూటీస్ ని అనుకుని హలీవుడ్ సింగర్ , నటి ఎమ్మా రాబర్ట్స్ ని తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఎన్టీఆర్ కు కూడా హీరోయిన్ దొరకినట్టే అంటున్నారు ఫిలింనగర్ జనాలు. ఇప్పటి వరకు ఎమ్మా హాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిందట. ఇండియన్ సినిమాలో ఇదే ప్రథమం. అయితే ఇటీవల రాజమౌళి ఎమ్మా ని ఫైనల్ చేయడానికే అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాను డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Also Read