English | Telugu

మహేష్ పై పూరి షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్!

on Jul 20, 2019

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుపై డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ డిస్కషన్ పాయింట్ అయ్యాయి. 'ఇస్మార్ట్ శంకర్' ప్రచారంలో భాగంగా ఒక ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హేష్‌పై పూరి గట్టి సెటైర్ వేశాడు. హిట్టుల్లో ఉంటేనే మహేష్ అవకాశం ఇస్తాడని ఆయన వ్యాఖ్యానించారు. మహేష్ అభిమానులకు తనపై నమ్మకం ఉన్నప్పటికీ... మ‌హేష్‌కి లేద‌నీ, అవకాశం ఇవ్వడం లేదని పూరి స్పష్టంగా చెప్పాడు. 'ఇస్మార్ట్ శంకర్' విజయం సాధించింది కనుక ఇప్పుడు మహేష్ మీకు అవకాశం ఇస్తారేమో అని యాంకర్ అనగా... 'నాకో క్యారెక్టర్ ఉంటుంది కదా. నేను ఓకే అనాలి కదా' అని పూరి సెలవిచ్చారు. పూరీని మహేష్ పిలిచి సినిమా చేద్దామని అడిగినా... పూరి చేయరు అన్నమాట.

పూరి వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు గుస్సా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దర్శకుణ్ణి ఒక ఆట ఆడుకుంటున్నారు. భీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. మహేష్-పూరి కాంబినేష‌న్‌లో 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌' వచ్చాయి. ఈ రెండు సినిమాలకు ముందు పూరి సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వలేదని, ఫ్లాపుల్లో ఉన్నాడని మహేష్ అభిమానులు చెబుతున్న మాట. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఆ రెండు సినిమాలు పూరి హిట్స్ ఇచ్చినప్పుడు మహేష్ అంగీకరించినవి అట. పూరి కోపానికి కారణం కూడా మహేష్ అంటున్నారు. 'జనగణమణ' కథ విని, అనౌన్స్ చేయమని పూరీతో చెప్పిన మహేష్, ఆ తరవాత మరో మాట చెప్పకుండా పూరీని పక్కన పెట్టారట. ఇదెంతవరకూ నిజమో మరి! ఓ పక్క ఈ డిస్కషన్ జరుగుతుండగా... 'సరిలేరు నీకెవ్వరు' సినిమా గురించి జగపతిబాబు క్లారిఫికేషన్ ఇచ్చారు. తాను ఇప్పటికీ 'సరిలేరు నీకెవ్వరు' చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఆ సినిమా కోసం రెండు సినిమాలను వదులుకున్నానని జగపతిబాబు వివరంగా చెప్పారు. ఆయన మాటలకు మద్దతు ఇస్తూ అనిల్ రావిపూడి కూడా వివరణ ఇచ్చారు. ఈ వివాదంలోనూ త‌ప్పు మ‌హేష్‌దేన‌ని ఇండస్ట్రీ గుసగుస. జగపతి బాబును వద్దని, ప్రకాష్ రాజ్‌ను తీసుకోమని దర్శకుడితో మహేష్ చెప్పారట.


Cinema Galleries



Latest News


Video-Gossips