English | Telugu

'ఆమె'కు ఆర్థిక సమస్యలు!?

on Jul 19, 2019

తెలుగులో 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో', 'లవ్ ఫెయిల్యూర్', 'బెజవాడ' చిత్రాల్లో నటించిన అమలా పాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'ఆమె'. తమిళ సినిమా 'ఆడై'కు అనువాదమిది. అమలా పాల్ న్యూడ్ యాక్టింగ్ పుణ్యమా అని సినిమాకు క్రేజ్ వచ్చింది. కానీ, థియేటర్లలోకి సినిమా మాత్రం రాలేదు. నిజానికి, ఈ రోజు సినిమా విడుదల కావాలి. కానీ, కాలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మార్నింగ్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల కాలేదు. అటు తమిళనాడులో కూడా ఎక్కడా షోలు పడలేదు. సాయంత్రం లోపు షోలు వేసే అవకాశం కనిపించడం లేదు. ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల ఆగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'ఆమె' విడుదల కాకపోవడంతో ఆ థియేటర్లను తమిళనాడులో విక్రమ్ 'మిస్టర్ కెకె' తమిళ్ వెర్షన్‌కు, తెలుగు రాష్ట్రాల్లో 'ఇస్మార్ట్ శంకర్', 'మిస్టర్ కెకె'కు కేటాయిస్తున్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here