`ధృవ్` నా కంటే బాగా నటించాడుః హీరో విక్రమ్
on Jul 16, 2019
నటుడు విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను ఏ క్యారక్టర్ చేస్తే ఆ క్యారక్టర్ కి తగ్గట్టుగా తనను మలుచుకుంటాడు. ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటాడు. అందుకు ఉదహారణలే శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలు. ఇక లేటెస్ట్ గా తమిళ్ లో `కడరమ్ కొండాన్` సినిమా చేసాడు. ఆ సినిమా తెలుగులో `మిస్టర్ కె.కె` పేరుతో ఈ నెల 19న విడుదలవుతోంది.
ఈ సందర్బంగా చియాన్ విక్రమ్ హైదరాబాద్ లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనయుడు ధృవ్ గురించి మాట్లాడుతూ...`ధృవ్ యుఎస్ లో మెథడ్ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ పాత్రకు తను మరి చిన్నోడు అవుతాడని తెలుసు. ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంటర్ డ్యూస్ చేద్దామనుకున్నాను. కానీ ఇంతలో ధృవ్ చేసిన డబ్ స్మాష్ వీడియో ఏదో చూసి తనతో సినిమా చేస్తామని కలిసారు. నేను ధృవ్ కి ఫోన్ చేసి చెప్పినప్పుడు...ఇప్పుడు చేయలంటారా? అని అడిగాడు. చెయ్ రా అని చెప్పడంతో చేసాడు. తను చాలా నేచరల్ గా నటించాడు.. కొన్ని సీన్స్ చూస్తుంటే నాకన్నా చాలా బాగా నటించాడనిపించింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో డిఫరెంట్ గా చేసాడు. వాటికి డబ్బింగ్ చెప్పే సందర్భంలో నేనుండంటంతో కొంచెం సిగ్గు పడ్డాడు. నేను ఆ సమయంలో బయటకు వెళితే చెప్పేవాడు`` అంటూ తనయుడు గురించి చెబుతూ పుత్రోత్సహాన్ని అనుభవించారు విక్రమ్.
Also Read