ఇన్నేళ్తైనా సినిమా మీద ప్యాషన్ తగ్గలేదు
on Jun 22, 2019
క్రియేటివ్, కమర్షియల్... బేనర్ లో ఎలా అయితే క్రియేటివిటీ, కమర్షియాలిటీ ఉందో ఆయన సినిమాల్లో కూడా క్రియేటివిటీ, కమర్షియాలిటీ వంద శాతం ఉంటాయి. ఇప్పటి వరకు ఈ సంస్ధలో 46 చిత్రాలు నిర్మించారు. అందులో సక్సెస్ ఫుల్ చిత్రాలదే అధికభాగము అని చెప్పాలి. ఇన్ని సినిమాలు చేసినా, ఇన్నేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా నాకు సినిమాలపై ప్యాషన్ తగ్గలేదు. మునుపటి ఉత్సాహంతో పని చేస్తున్నాను అంటున్నారు ప్రముఖ నిర్మాత కేయస్ రామారావు. తాజాగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ` కౌసల్య కృష్ణమూర్తి` చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కామెడీ ఆర్టిస్ట్ శ్రీలక్ష్మి మేనకోడలు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించింది. గతంలో మేము భీమనేని శ్రీనివాసరావు తో కలిసి పలు రీమేక్ లు చేసి సక్సెస్ లు సాధించాను. ఇక తాజాగా తండ్రీ కూతుళ్ల మధ్య సాగే కథాంశంతో తెలుగులో `కౌసల్య కృష్ణ మూర్తి` సినిమాను రీమేక్ చేసాం. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుంది. జూలై సెకండ్ వీక్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. జూలై 2 న చేయబోయే ప్రీ రిలీజ్ కార్యక్రమానికి మిథాలీ రాజ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. చిన్న సినిమా అయినా కథలో దమ్ముంటే ఆడుతుందన్న నమ్మకంతో ఈ సినిమాను రీమేక్ చేసాం. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు కూడా అదే ఆనందంతో ఉంటాను`` అన్నారు.