వెరైటీగా నాని `వి` స్టోరి!!
on Jun 17, 2019
ఇటీవల `జెర్సీ`తో మంచి విజయాన్ని అందుకున్న నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక వైపు టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న `గ్యాంగ్ లీడర్` లో నటిస్తూనే మరోవైపు సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` చిత్రంలో కూడా నటిస్తున్నాడు నాని. కాగా ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న `వి` చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం టాలీవుడ్ సర్కిల్స్ లో హాల్ చల్ చేస్తోంది.
అదేమిటంటే క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని వరుస హత్యలను చేసి క్లూస్ కూడా వదిలేస్తుంటాడట. ఈ నేపథ్యంలో ఆ కేసును డీల్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ సుధీర్ బాబు. ఆ మిస్టరీని ఎలా ఛేదించాడు ? అనే కథాంశంతో `వి` సినిమా తెరకెక్కుతోందని టాలీవుడ్ టాక్ . ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. `దిల్` రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావ్ హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.