నాకు యాక్టింగ్ రాదనుకున్నాడట - బెల్లంకొండ శ్రీనివాస్
on May 22, 2019
`ఎంతసేపు కోట్లు , స్లో మోషన్ లో బిల్డప్ షాట్సే నీ సినిమాలో ఉంటాయి. నువ్వు ఇంత బాగా యాక్టింగ్ చేయగలవని అనుకోలేదని` దర్శకుడు తేజ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని ఉద్దేశించి అన్నారట. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా `సీత` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన చెబుతూ...షూటింగ్ మొదటి రోజు ఫుల్ పేజీ డైలాగ్ పేపర్ చేతిలో పెట్టారు తేజ గారు. అది చూడగానే నా యాక్టింగ్ కు తేజ గారు పరీక్ష పెడుతున్నారని అర్థమైంది. కేర్ వ్యాన్ లోకి వెళ్లి ఆ ఫుల్ పేజీ డైలాగ్ పేపర్ ఫుల్ గా ప్రిపేరయ్యాను. షాట్ రెడీ అనగానే సింగిల్ టేక్ లో డైలాగ్స్ చెప్పేసాను. తేజ గారు షాకయ్యి.. నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావనుకోలేదంటూ ఫస్ట్ రోజే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.